స్వచ్ఛ సుందర చల్లపల్లి – 31/07/2019 (1723* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1723* వ నాటి సమీక్ష.

ఈ వేకువ 4.08 –  6.10 నిముషాల మధ్య శివరామపురం బాటలోని గుడిసెల సమీపంలో సాగిన స్వచ్ఛతా ప్రయత్నంలో పాల్గొని, తమ గ్రామ బాధ్యత నెరవేర్చిన ధన్యులు 32 మంది.

– ఇందులో సగం మంది రహదారి ఇరు ప్రక్కల చెట్ల మీద నుండి పడిన, పడుతున్న తాడి పండ్లను ఏరి, ఆ చెట్ల మొదళ్ల లోని గడ్డిని, తుక్కును, ఆకుల్ని తొలగించి శుభ్ర పరిచారు. గ్రామీణ సాంప్రదాయక ఆహారమైన ఈ ముగ్గిన పండ్లను కొందరు ఇళ్లకు తీసుకెళ్లారు.

– మరికొందరు రోడ్డు మీది దుమ్మును, ప్లాస్టిక్ కవర్లను తుక్కును ఏరి, ఊడ్చి, పోగుల్ని ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి తరలించారు.

ఆ దారిలో ప్రయాణించే వారు ఒక్క నిముషం ఆగి, పంట కాలువ వంతెన, మేకల డొంక మురుగు కాల్వ వంతెనల మధ్య ఈ స్వచ్ఛ – శుభ్ర- హరిత-సుందర దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు! ముచ్చట పడితే సెల్ఫీ లు కూడ దిగవచ్చు!

– సుందరీకరణ బృందం వంతెన సమీపంలో కాల్వగట్టు దగ్గరి ప్రదేశాన్ని అద్దంలా తీర్చి దిద్ది, పాత మొక్కల పాదులను సరిజేసి, కొత్త పూల మొక్కల్ని నాటడాన్ని చాయా చిత్రంలో గమనించగలరు.

– స్వచ్ఛ సైన్యం పనివేళ(6.00) ముగిసిన తరువాత కూడ ముగ్గురు కార్యకర్తలు వంతెన పైన మట్టిని, దుమ్మును గోకి, ఊడ్చి రోడ్ల గుంటల్ని పూడ్చుతూ కనిపించారు.

– E.O బొల్లినేని ప్రసాదు గారు పంచాయతి కార్మికులు రెండవసారి కూడా అంటే రాత్రి వేళ కూడ రోడ్లను శుభ్ర పరచడాన్ని, ప్లాస్టిక్ సంచుల నిషేధం అమలును ప్రస్తావించారు.

– స్వచ్ఛ కార్యకర్త , విజయా జూనియర్ కళాశాల పౌర శాస్త్రోపన్యాసకుడు వేముల శ్రీనివాస్ గారు  తన తరగతి గదుల్లో విద్యార్ధులకు స్వచ్ఛ శుభ్రతా అవగాహన కల్పిస్తున్న తీరును వివరించారు.

6.40 నిముషాలకు ఈయనే ధృఢ స్వచ్ఛ సంకల్ప నినాదాలను ముమ్మారు పలికి, అందరితో పలికించి నేటి ప్రాభాత సేవకు స్వస్తి పలికారు.

రేపటి మన స్వచ్చంద గ్రామ సేవ శివరామపురం వంతెన దగ్గరే.

         

     స్వచ్ఛ సైన్యం జైత్ర యాత్రలు.

మేము మెచ్చిన దొకే బాటని- మాకు నచ్చిన దొకే బాటని

సేవలన్నీ స్వార్ధ రహితం- సుందరీకరణమే మంత్రం

జనంలో కదలికే గమ్యం-గ్రామహితమేకైక లక్ష్యం

స్వచ్ఛ సైన్యం జైత్ర యాత్రలు సాగె గత ఐదేళ్లనుండీ!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 31/07/2019

చల్లపల్లి.

14.08 కు శివరాంపురమ్ వంతెన వద్దMrng (1) Mrng (2) Mrng (4) Mrng (5) Mrng (7) Mrng (8) Mrng (9) Mrng (10) Mrng (11) Mrng (12)1 (1)తాటికాయలు ఏరి ట్రాక్టరులో ఎత్తుతున్న రెస్క్యూ టీమ్1 (2) 1 (4) 1 (6) 1 (7) 1 (8) 1 (11) 1 (13) 1 (16) 1 (21) 1 (27) 1 (29) 1 (32) 1 (33) 1 (34) 1 (36) 1 (37) 1 (38) 1 (39) 1 (40) 1 (41) 1 (45) 1 (49)నాగాయలంక రోడ్డు లో డ్రైన్ ను తీస్తున్న పంచాయతీ వారి మిషన్1 (50) 1 (51)

1 (3) 1 (34)1 (19) 1 (20)సుందరబృందం ఉద్యానవనం1 (5)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *