స్వచ్ఛ సుందర చల్లపల్లి – 01/08/2019 (1724* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1724* వ నాటి స్వచ్ఛతా ప్రయత్నం.

మాటి మాటికీ వరుణ దేవుడు పలకరిస్తున్న నేటి బ్రహ్మ ముహూర్తం 4.08 –  6.07 నిముషాల మధ్య ఉభయ  శివరామపురాల నడుమ రహదారి కిరువైపుల 22 మంది సైనికుల స్వచ్ఛ పోరాటం సాగింది. వీరిలో :-

– దారి ప్రక్క గతంలో తామే నాటి పెంచిన, రోడ్డు కడ్డం వస్తున్న చెట్ల కొమ్మల్ని తీస్తున్నవారు,

– పాత మొక్కలకు పాదులు సరిజేసి, కలుపు తీస్తున్నవారు,

– రహదారి పల్లంలో నిలిచిన వాన నీటిని డ్రైనులో కిమళ్లిస్తున్నవారు,

– పై పనుల్ని పర్యవేక్షిస్తున్నవారు,

– డంపింగ్ యార్డ్ లో రోడ్డు నిర్మాణానికి  రెస్క్యూ టీం వారు సెంటర్ లోని రద్దును ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించారు.

ఇలా ఎవరి ఉద్యోగం వాళ్లది, ఎవరి ఆనందం వాళ్లది!

జోరు వానను ఆనందిస్తూ- తమ కోసం కాక, ఊరి జనం కోసం శ్రమలో లీనమై, సాముహికంగా- స్వచ్చందంగా ఇందరు పాటుబడటం- నాకిదొక స్వచ్ఛ సుందర కమనీయ దృశ్యం!

కృష్ణాజిల్లా కలెక్టరు గారి విజయవాడ సమావేశం లో పాల్గొని, ఏక మాత్ర(Single Use) ప్లాస్టిక్ వస్తువుల వాడకం సమస్యపై ప్రసంగించి, స్వచ్చోద్యమ చల్లపల్లికి అక్కడి వారందరి ప్రశంసలు స్వీకరించిన దాసరి రామకృష్ణ ప్రసాదు గారు విజయవాడ నగరం లోను, జిల్లాలోను, ఆ సమస్య త్వరలోనే పరిష్కృతం కాగలదనే తన ఆశావహ అంచనాలను వివరించారు. రావెళ్ల శివరామకృష్ణయ్య మాష్టారు శివరామపురం రోడ్డు లో స్వచ్చ సేవ జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు.

6.40 నిముషాలకు ప్రేమానందం గారి వినయ పూర్వక స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలకు  బదులిచ్చిన కార్యకర్తలు  నేటి గ్రామసేవకు స్వస్తి పలికారు.

రేపటి మన స్వచ్చంద గ్రామ సేవ కోసం శివరామపురం దగ్గరే కలుసుకుందాం.

 

కర్త లెవ్వరు? భోక్త లెవ్వరు?

ప్లాస్టిక్ భూతం కోరలన్నీ పీకితే గద ప్రజారోగ్యం?

పర్యావరణ వినాశనానికి పలుక వలదా సమాధానం?

గ్రామ రొచ్చుల-గబ్బు జబ్బుల కర్తలెవ్వరు? భోక్త లెవ్వరు?

పాపమెవరిది? శాపమెవరికి? స్వచ్ఛ సైన్యం పరుగులెచటికి?

          

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 01/08/2019

చల్లపల్లి.

14.08 కు  శివరాంపురమ్ వద్దMrng (2)ప్రేమానంద్ గారి ఇంటి వద్దMrng (1) Mrng (3) Mrng (4)Mrng (6) Mrng (7)సువర్నగన్నేరు మొక్క ట్రిమ్మింగ్ చేస్తున్నారు1 (5)నీటి మల్లింపు1 (6) 1 (7) 1 (9) 1 (11) 1 (12) 1 (17) 1 (18)మొక్కలు నాటుతున్న కార్యకర్తలు1 (19)1 (25)ఏపుగా పెరిగిన జీలగ చేను1 (26)1 (36)బోగన్ విలియా మొక్కలు నాటుతున్న కార్యకర్తలు1 (27)1 (35) 1 (40)1 (31) 1 (34) 1 (36) 1 (39) 1 (42)1 (16)స్వచ్చ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వస్తూ

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *