స్వచ్ఛ సుందర చల్లపల్లి – 02/08/2019 (1725* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1725* వ నాటి శ్రమ విన్యాసం.

ఈ వేకువ 4.08 – 6.05 నిముషాల మధ్య రెండు శివరామపురాల మధ్య కోళ్ల ఫారాల సమీపంలోని రోడ్డు మార్జిన్ల లోను, చల్లపల్లి ప్రధాన వీధిలోను స్వచ్ఛ సేవలలో కృతార్ధులైన వారు 24 మంది.

– వీరిలో ఐదుగురు స్వచ్చ యోధులు బందరు మార్గంలోని మురుగు కాల్వ ప్రక్క పడి ఉన్న పనికిరాని మూత రాళ్లను పగులగొట్టి ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రపు అసంపూర్ణ మార్గంపై పరచి వచ్చారు. బహుశా మరి కొన్ని వారాలలో వీళ్ల చేతిలో ఆ రోడ్డు పూర్తి కావచ్చు.

– ఇక మిగిలిన వారు యధా విధిగా శివరామపురం రోడ్డు మార్జిన్ల అశుభ్రత మీద, అనాకారితనం మీద దండెత్తారు.

కొందరు ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ సంచులు ఏరగా, కొందరు పిచ్చి-ముళ్ల మొక్కల పని బట్టగా, సుందరీకరణ బృందం వారి చేతులు గతం లో తాము పెట్టి, పెంచిన చెట్ల కొమ్మలు కత్తిరించి, ఆ పచ్చదనానికి మెరుగులు దిద్దాయి.

అంతకు ముందటి మొక్కల పాదుల్ని కొన్ని చేతులు సరిజేశాయి. ఉభయ దిశల్లో పంట పొలాల మధ్య – తెల తెలవారుతున్న ఆ చల్లని శుభోదయాన-మైకు నుండి వినిపిస్తున్న కొసరాజు రాఘవయ్య ఏరువాక పాట అచ్చ తెలుగుదనం గుబాళింపులలో- స్వచ్ఛ సుందర కర్తల హాస్యోక్తుల నడుమ-స్వార్ధం కోసం గాక-పరుల కోసం 1724 రోజులుగా సునాయాసంగా సాగుతున్న ఈ

‘’ శ్రమ బంధుర సుమ సుందర యదార్థ దృశ్యం’’ నా వంటి కొందరికి (శ్రీ శ్రీ పేర్కొన్నట్లు ) ‘క్షణికమై, శాశ్వతమైన బ్రహ్మానుభవం!

ఆర్భాట మెరుగని స్వచ్ఛ కార్యకర్త లక్ష్మణ రావు స్వచ్చోద్యమానికి నమస్కరిస్తూ, ముమ్మారు పలికిన స్వచ్ఛ సంకల్ప నినాదాలు మిగిలిన కార్యకర్తల గళాలలో ప్రతిధ్వనించి, 6.40 నిముషాలకు నేటి స్వచ్చ సేవ ముగిసింది.   

నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఈ స్వచ్ఛ కార్యకర్తలకు బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ చేసిన పెద్దలు ఉడత్తు రామారావు గారు అభివందనీయులు.

అమెరికాలో మన కార్యకర్త నాదెళ్ల సురేష్ ‘’ చల్లపల్లి స్వచ్ఛ మారథాన్’’ కు అనుకరణగా-జ్ఞాపికగా ఈ 4 వ తేదీ ఆదివారం చల్లపల్లి స్వచ్ఛ సుందర టాయిలెట్ల(నాగాయలంక రోడ్డు) నుండి మోపిదేవి వరకు(6 km) నడవాలని కార్యకర్తల సంకల్పం.  

రేపటి మన స్వచ్చంద సేవ కూడా శివరామపురంలో ప్రేమానంద్ గారి ఇంటి దగ్గర .

 

          ఐదేళ్లనాడు(2014లో)

ఒక్కమారే వాడి వదలే దిక్కుమాలిన ప్లాస్టిక్ తుక్కులు

ప్రజారోగ్యం క్రుంగదీస్తూ – పర్యావరణం దెబ్బ తీస్తూ-

భూమి మనుగడ అంతు జూస్తూ-బోర విరుచుక పెరుగునప్పుడు

చల్లపల్లి స్వచ్ఛ సైన్యం సమర దుందుభి మ్రోగు చప్పుడు!

          

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 02/08/2019

చల్లపల్లి.

14.10 కు శివరాంపురమ్ ప్రేమానంద్ గారి ఇంటి వద్దMrng (12) Mrng (19)

Mrng (13)బందరు రోడ్డులో రద్దు రాళ్లు ఎత్తుతున్నారు
Mrng (1) Mrng (2) Mrng (3) Mrng (5) Mrng (6) Mrng (7) Mrng (9) Mrng (11) Mrng (14) Mrng (16) Mrng (18)1 (3) 1 (16) 1 (23) 1 (27)1 (26)అందంగా వున్న కోనో కార్పస్ మొక్క1 (21) 1 (25)1 (5) 1 (9) 1 (10) 1 (12)మొక్కకు కంపకడుతున్నారు
1 (13) 1 (15) 1 (19) 1 (28) 1 (29) 1 (32) 1 (33)1 (7)1 (1) 1 (30) 1 (31)

Powered by Facebook Like

One Response to స్వచ్ఛ సుందర చల్లపల్లి – 02/08/2019 (1725* వ రోజు)

  1. గోళ్ళ సాం బశివరావ్ says:

    ఆరు కిలోమీటర్ల మారధాన్ చేద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *