స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03/08/2019 (1726* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1726* వ నాటి విశేషాలు.

నేటి ఉదయానికి పూర్వం 4.05 – 6.05 నిముషాల మధ్య చల్లపల్లికి శివారుగా భావించబడే మూడు కిలోమీటర్ల దూరంలోని శివరామపురాల నడుమ స్వచ్చ సేవలో పునీతులైనది 33 మంది.

– వర్షం తెరపి ఇవ్వడంతో వీరిలో ఎక్కువమంది దారికిరుప్రక్కలా డ్రైన్లలోని తాటాకుల – ముళ్ళ కంపల – తాటికాయల – పిచ్చిమొక్కల తొలగింపులో గడిపారు.

– పాతమొక్కల సుందరీకరణను కొందరు చేపట్టారు. ఊరిలోని ఇళ్ల ముందర కొన్ని మొక్కల కొమ్మల్ని కత్తిరించి, పొందికగా – కరెంట్ తీగల కడ్డంలేని రీతిలో అమర్చారు.

– పంచపాండవ స్వచ్చ వీరులు చల్లపల్లి – బందరు మార్గంలో కుడివైపున డ్రైన్ల పాత మూతల్ని ముక్కలు గొట్టి, ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ కేంద్రంలోని అసంపూర్ణ మార్గంలో పోసి వచ్చారు.

     స్వచ్చ సైనికుల శ్రమతో శివరామపురం రహదారి పునర్నవీకృతమై మరింత శుభ్రసుందరంగా కనిపించడాన్ని గమనించండి.

          అమెరికా ప్రవాసి నల్లూరి సూర్యవర్ధన్ తన మాతృగ్రామ ప్రయోజనం కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్షరూపాయల చెక్కును తన తండ్రి ద్వారా అందించినందుకు ధన్యవాదాలు.

    స్వచ్చోద్యమ బాలకార్యకర్తలు ఆర్య – ఆరవ్ చల్లపల్లి స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలు ముమ్మారు పలికి, కార్యకర్తలచేత పలికించి 6.40 నిముషాలకు నేటి మన స్వచ్చంద సేవలు ముగించారు.

    ముందు నుండీ అనుకొంటునట్లుగా రేపటి మన స్వచ్చంద సేవలు “స్వచ్చతా నడక/పరుగు రూపంలో ఉంటాయి. అందుకోసం అధిక సంఖ్యలో అందరం నాగాయలంక రోడ్డులోని స్వచ్చ – సుందర పబ్లిక్ టాయిలెట్ల దగ్గర 4.30కు కలుసుకుందాం. ఏకరూప స్వచ్చ సైన్యం దుస్తులతో – జెండాలతో నాల్గుగ్రామాల వారికీ స్వచ్చోద్యమ ఆశయాలను ప్రకటిద్దాం!   

 ఐదేళ్ళక్రిందట

కేవలం స్వార్ధల కోసం కృషులు జరిగే కాలమందున

వ్యక్తి కేంద్రంగా చలించే వికటమైన సమాజమందున

సమిష్టి శ్రేయం దృష్టితో – ఒక సాహసాత్మక ఉద్యమంగా  

చల్లపల్లి స్వచ్ఛ సైన్యం సమర దుందుభి మ్రోగెనప్పుడు!

          

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 03/08/2019

చల్లపల్లి.

14.05 కు శివరాంపురం ప్రేమానంద్ గారి ఇంటి వద్ద 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 2327 (1) 27(2) 27(3) 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39Ramarao masterఅమెరికా ప్రవాసి నల్లూరి సూర్యవర్ధన్ తన మాతృగ్రామ ప్రయోజనం కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్షరూపాయల చెక్కును తన తండ్రి ద్వారా అందించినందుకు ధన్యవాదాలు.

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *