స్వచ్ఛ సుందర చల్లపల్లి – 04/08/2019 (1727* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1727* వ నాటి విశేషాలు.

నేటి ప్రాతఃకాలం (70+20) 90 మంది వివిధ వృత్తుల, సంఘాల వారు పాల్గొన్న సామాజిక చైతన్య సేవ 4.40 – 6.50 నిముషాల మధ్య విజయవంతమైనది.

నిర్ణీత ప్రణాళిక ప్రకారం 4.35 కే నాగాయలంక దారి – స్వచ్ఛ సుందర టాయిలెట్ల వద్దకు చేరుకొన్న కార్యకర్తలు 70 మంది ఒక వంక స్వచ్చతా గీతాలు మైకు నుండి వింటూ – నినాదాలతో – చేతుల్లో జెండాలతో – కాసానగర్ – పెదప్రోలు – భాషిత పాఠశాలల వద్ద మాత్రం ఐదేసి నిముషాలు ఆగి – 5కి.మీ. దూరంలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి 6.15 నిముషాలకు చేరుకున్నారు.

ఆలయానికి తూర్పు, దక్షిణ మార్గాలలో దుమ్మును ప్లాస్టిక్ సంచుల్ని, టీ కప్పుల్ని, ఇతర వ్యర్ధాలను చీపుళ్ళతో ఊడ్చి, శుభ్రపరిచారు. అక్కడి వందలాది మంది భక్తులకు , మోపిదేవి సెంటర్లోని ప్రజలకు తమ సేవాపూర్వక – వినయ పూర్వక హెచ్చరికలతో – నినాదాలతో – అభ్యర్ధనలతో స్వచ్చ – శుభ్రతా స్ఫూర్తిని కల్గించే ప్రయత్నం చేశారు.

ఈ రెండు గంటల కార్యక్రమం ఆద్యంతం ఘంటశాలకు చెందిన నందేటి శ్రీనివాస్ ప్రతి సెంటర్ లోనూ తన పాటలతో – మాటలతో స్వచ్చ సైన్యం 1727 రోజుల ప్రస్థానాన్ని వివరిస్తూ – నినదిస్తూ – సమన్వయపరుస్తూ అంతటా తానై విహరించాడు.

స్వచ్చ సైనికులతోబాటు నడక సంఘం, మెకానిక్ ల సంఘం, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ధ్యానమండలి, ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. మోపిదేవిలో కొందరు వీరితో కలిశారు.

స్వచ్చోద్యమ సారధి డాక్టర్. రామకృష్ణ ప్రసాదు గారు సేవానంతర సమావేశంలో ఈ ఉద్యమ లక్ష్యాలను వివరించి, జులై మాసపు ఆదాయ వ్యయాల వ్యత్యాసాన్ని తెలిపారు. ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఈ క్రింది దాతల విరాళాలను కృతజ్ణతతో స్వీకరించారు.

ప్రాతూరి శంకర శాస్త్రి గారు : 5000/-

          రవివర్మ గారు : 5000/-

          కోడూరు వేంకటేశ్వరరావు గారు : 500/-

          సాంబశివరావు గారు : 500/-

          గోళ్ళ వెంకటరత్నం గారు : 300/-

          పొనమాల చిన్నబ్బాయి గారు : 1000/-

తక్షణ స్పందనగా మోపిదేవి వాస్తవ్యులు రావి రామనాధబాబు గారు : 1001/-

వీరందరి స్వచ్చోద్యమాభిమానానికి, ప్రోత్సాహకానికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదములు.

స్వచ్చ కార్యకర్తల సేవలకు సానుకూలంగా స్పందించిన మోపిదేవి వాస్తవ్యులకు, వ్యాపారులకు, బడ్డీ, టీ కొట్ల మిత్రులకు మా కృతజ్ఞతలు.

కార్యక్రమానంతరం శ్రీ భాషిత పాఠశాలలో పొనమాల చిన్నబ్బాయి – కమలశ్రీ దంపతులు అల్పాహారం పేరుతో ఇచ్చిన విందును స్వీకరించి 7.50 కి అంతా గృహోన్ముఖులయ్యారు.

రేపటి మన స్వచ్చ సేవలు శివరామపురం వద్ద.

 

సమీక్షించి – స్వాగతించి

విశాలాంధ్ర రాష్ట్రంలో – భరత భూమి చరిత్రలో

దశాబ్దాల గతంలోన ఈ సుదీర్ఘ ఉద్యమాలు

సాగినవో – గెలిచినవో – సమీక్షించవలసినదే!

స్వచ్చోద్యమ చల్లపల్లి స్వాగతింపవలసినదే!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 04/08/2019

చల్లపల్లి.

14.12 కు నాగాయలంక రోడ్డు లో 2 3 4స్వచ్చతా నడకను ప్రారంభిస్తున్న పంచాయితీ కార్యదర్శి బొల్లినేని ప్రసాదు గారు  5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38M.V.ట్రేడర్స్ రంగారావు గారు ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే బ్యాగులను కాకుండా మళ్ళీ మళ్ళీ వాడగలిగే బ్యాగుల మీద పేరు రాయించి వాడుతున్నారు. ఒక నమూనాగా 2 బ్యాగులను స్వచ్చ చల్లపల్లి ఉద్యమానికి అందచేశారు.   39 40 Chinnabbay garuపొనమాల చిన్నబ్బాయి గారు : 1000/-Golla Venkataratnam garuగోళ్ళ వెంకటరత్నం గారు : 300/-Koduru Venkateswara Raoకోడూరు వేంకటేశ్వరరావు గారు : 500/- Ramanadham garuమోపిదేవి వాస్తవ్యులు రావి రామనాధబాబు గారు : 1001/- Ravi Varma garuగత నెలలో 14,000/- విరాళమిచ్చి మళ్ళీ 5000/- ఇస్తున్న వర్మ గారు  Sambasivarao masterT. సాంబశివరావు గారు  : 500/- Sastry garuప్రాతూరి శంకర శాస్త్రి గారు : 5000/-

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *