స్వచ్ఛ సుందర చల్లపల్లి – 05/08/2019 (1728* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1728* వ నాటి పనులు.

నేటి వేకువ 4.13 – 6.05 నిముషాల మధ్య శివరామపురాల దగ్గర, చల్లపల్లి బందరు దారిలో తమ సామాజిక బాధ్యత తీర్చుకొన్నవారు 26 మంది.

1) శివరామపురం వంతెన వద్ద- మేకల డొంక మధ్య డజను మంది కార్యకర్తలు పాత మొక్కల పాదులను సరిజేసి, గడ్డి పీకి, రాలిన తాడి పండ్లను ఏరి, తాటి మట్టల్ని, వ్యర్ధాలను ఊడ్చి, ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి చేర్చారు. కొత్త పాదులు తీసి చెట్లకు పాకే విధంగా కాగితపు పూల మొక్కలు నాటారు.

 రెండు శివరామపురాల మధ్య రోడ్డు ప్రక్కన కూడా 15 కాగితపు పూల మొక్కలు నాటారు. వీటితో ఈ వారంలో నాటినవే 415మొక్కలు.

2) ‘రెస్క్యూ టీమ్’ అనే పౌరుష నామం గల ఐదుగురు బందరు రోడ్డులోని డ్రైన్ల పై కప్పు (నిరర్ధకమైన) రాతి పలకల్ని ముక్కలు కొట్టి ట్రాక్టర్ కెత్తి డంపింగ్ యార్డ్ రోడ్డును మెరక చేశారు.

  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చల్లపల్లికి సంపద సృష్టి కర్తలు, ఆరోగ్య పరిరక్షకులు స్వచ్ఛ సైనికులే గదా!

3)వృద్ధులతో సహా కొందరు కార్యకర్తలు శివరాంపురం రోడ్డు ను, మార్జిన్లను ఊడ్చే స్వచ్ఛ చర్యను చేపట్టారు.

 (మహర్షి, శ్రీమంతుడు వంటి సినిమాలలో హీరోలు చేసేవి కల్పిత చలన చిత్ర సన్నివేశాలు. మరి స్వచ్ఛ చల్లపల్లిలో 1728 రోజులుగా జరుగుతున్నవి ప్రత్యక్ష-యదార్ధ- ఆదర్శ సేవలు)!

నేటి కార్యక్రమం లో ధ్యాన మండలి సభ్యులు పాల్గొన్నారు.

నేటి కార్యక్రమంలో స్వచ్ఛ కార్యకర్తలు నలుగురు BSNL నరసింహారావు గారు,  తూములూరి లక్ష్మణ రావు గారు, కస్తూరి శ్రీనివాసరావు గారు,  గంధం బృందావన్ గారు కార్యకర్తల కోసం 12 రెయిన్ క్యాప్ లను బహూకరించారు.

స్వచ్ఛ కార్యకర్త రాయపాటి రాధాకృష్ణ గారు ‘’ మనకోసం మనం’’ ట్రస్టు ఖర్చుల నిమిత్తం అందించిన 1000/-విరాళానికి ధన్యవాదాలు. ఈయనే నిన్నటి మోపిదేవి నడక, ఆలయ పరిసర సేవలను సమీక్షించి, ముమ్మారు గొంతెత్తి స్వచ్ఛ సుందర నినాదాలు పలికి, అందరిచే పలికించి 6.40నిముషాలకు నేటి సేవలు ముగించారు.

ప్రకృతి వ్యవసాయంలో దశాబ్దం అనుభవమున్న సూరపనేని జగన్నాధం గారి (చిట్టూర్పు-వేములపల్లి జంక్షన్) స్వచ్ఛ ఆకు కూరల- కూర గాయల లభ్యత ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.    

రేపటి మన గ్రామ బాధ్యతా నిర్వహణ శివరామపురం దారిలో వంతెన వద్ద!

                   అసలింతకీ ఇది……

చల్లపల్లి స్వచ్చోద్యమ చారిత్రక సమాయమా?

మాననీయ- మానవీయ మహితోజ్జ్వల ఘట్టమా?

జనం కొరకు జనం మధ్యె పనిచేసే ఉద్యమమా?

స్వచ్ఛ సంస్కృతికి బీజావాపన సమ్మర్ధమా?

 – నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 05/08/2019

చల్లపల్లి.

14.13 కు శివరాంపురమ్ రోడ్డు లోMrng (1) Mrng (2) Mrng (3) Mrng (4) Mrng (5) Mrng (6)నాటిన బోగన్ విలియా మొక్కMrng (9) Mrng (11) Mrng (12)కాగితంపూల మొక్కలు నాటుతున్న కార్యకర్తలుMrng (14)ఏటీఎం సెంటరు వద్ద రాళ్లగుట్ట లోడింగ్ చేస్తున్న రెస్క్యూటీమ్Mrng (15) Mrng (16)1 (3)విరాళం అందిస్తున్న రాయపాటి రాధాకృష్ణ గారు1 (14)రెయిన్ క్యాప్ లు అందిస్తున్న కార్యకర్తలు1 (1) 1 (5) 1 (8) 1 (10) 1 (11) 1 (15) 1 (19) 1 (26) 1 (29) 1 (31) 1 (33)1 (27) 1 (32)1 (22)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *