స్వచ్ఛ సుందర చల్లపల్లి – 06/08/2019 (1729* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1729* వ నాటి వర్తమానాలు.

ఆగకుండా పడుతున్న సన్న చినుకుల ముసురులో ఈ నాటి వేకువ 4.08 – 6.12 నిముషాల మధ్య 24 మంది ఆదర్శ కార్యకర్తల సేవలు శివరామపురం పంట కాలువ సమీపంలో చోటుచేసుకున్నవి.  

– గ్రామం- వంతెనల మధ్య దారికిరువైపుల కరెంటు స్తంభాల క్రింద గతంలో నాటి బాగా పెరిగిన చెట్ల కొమ్మల్ని కత్తిరించి, అందంగా రూపొందించే సుందరీకరణ చర్యలతో బాటు పిచ్చి-ముళ్ల మొక్కల్ని పీకి- నరికి కనిపించిన క్యారీ బ్యాగుల్ని, చెత్త తుక్కులు ఏరి, కొన్ని పాదులు సరిజేశారు.

– కాగితం పూల మొక్కలు 25 ఈ రోజు కూడా నాటారు.

– బరువు పనుల కిష్టపడే ‘ రహదార్ల రక్షక దళం బందరు మార్గంలో కుడి వైపున మిగిలిన డ్రైను మూతల వ్యర్ధాలతో చెత్త కేంద్రం రోడ్డు ను మెరక చేశారు.

– స్వచ్ఛ కార్యకర్తల శ్రమదాన ప్రేరణతో వంతెన సమీప పాకలో ఉండే బాల విద్యార్ధిని సింధు, అక్కడి పొలం పని చేస్తున్న యువ రైతు నాదెళ్ల రాజేష్ లు స్వచ్చంద సేవలో పాల్గొనడం విశేషం.

గత ఆదివారం నాటి ‘ మోపిదేవి నడకను’ ఆలయ సమీపంలోని స్వచ్ఛ సేవను, ఆనాటి కార్యక్రమ నిర్వాహకుడైన డాక్టర్. డి.ఆర్.కె. ప్రసాదు గారి ప్రతిక్షణ అప్రమత్తతను పేర్కొని, మైకు ధ్వని కన్నా మిన్నగా మూడు మార్లు స్వచ్ఛ సంకల్ప నినాదాలను గర్జించి, అందరిచే పలికించి, కోడూరు వేంకటేశ్వర రావు గారు 6.40 నిముషాలకు నేటి బాధ్యతా నిర్వహణను ముగించారు.

రేపటి మన స్వచ్ఛ సుందర సేవా భాగ్యం కోసం శివరామపురం దగ్గరి వంతెన దగ్గర కలుద్దాం!

 

                జైత్ర యాత్రల స్వచ్ఛసైన్యం.

సమస్త గ్రామం స్వచ్ఛ సుందర సమున్నతముగ తీర్చిదిద్దే-

ఊరి జనముల ఎదలు మొత్తం స్వచ్ఛ శుభ్ర స్ఫూర్తి నింపే-

దోమలీగల – జబ్బు గబ్బుల తునిమి పొలిమేరలకు తరిమే

స్వచ్ఛ సైన్యం జైత్ర యాత్రలు సాగె గత ఐదేళ్ల నుండీ!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 06/08/2019

చల్లపల్లి.

14.08 కు శివరాంపురమ్ వద్దMrng (1) Mrng (2) Mrng (3) Mrng (4) Mrng (5) Mrng (6) Mrng (8) Mrng (11) Mrng (12)నాటుతున్న బోగన్ విలియాMrng (7)ATM center. వద్ద డ్రైన్ బండలు తీస్తున్న రెస్క్యూటీమ్Mrng (9) Mrng (10)1 (1) 1 (2)కార్యకర్తలు నాటిన మొక్కలతో అందంగా ఉన్న శివరామపురం రోడ్డు1 (5) 1 (7) 1 (11) 1 (12)1 (30)ముందు1 (13)తర్వాత1 (15) 1 (16) 1 (17) 1 (19) 1 (20) 1 (21) 1 (23) 1 (28)రోడ్డు ప్రక్క ఉన్న వర్షపు నీటిని డ్రైన్ లోకి పంపుతున్న కార్యకర్తలు1 (39) 1 (42)నాటిన బోగన్ విలియా1 (25) 1 (32) 1 (40)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *