స్వచ్ఛ సుందర చల్లపల్లి – 07/08/2019 (1730* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1730* వ నాటి కబుర్లు.

స్వచ్ఛ సైనికుల సుప్రభాత సేవలు 1) శివరామపురం సమీపంలో, 2) చల్లపల్లి ముఖ్య కూడలిలో పాల్గొన్న స్వచ్చోద్యమ కారులు 24 మంది 4.08 – 6.10 నిముషాల మధ్య.

 

– పడీ పడని చినుకుల తుంపరల మధ్య 7 వ నంబరు పంట కాలువ- శివరామపురం మధ్య 200 గజాల మేర దారి కిరువైపుల 20 మంది స్వచ్చ కార్మికులు బాగా పెరిగిన పాత చెట్లకు గతంలో కట్టిన ముళ్ల కంపతో సహా గడ్డిని, ముళ్ల- పిచ్చి మొక్కల్ని కోసి, ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్ధాలు ఏరి, ఊడ్చి, ట్రాక్టర్ కెత్తి డంపింగ్ కేంద్రానికి తరలించారు.

 

– గ్రామ విపత్తుల దళం నేడు కూడ ప్రధాన కూడలి దగ్గర నాగాయలంక రోడ్డు లోని డ్రైన్ల పనికిరాని పాత మూతలను బ్రద్దలు కొట్టి, ట్రాక్టర్ తో శ్మశానం ప్రక్కన డంపింగ్ కేంద్రపు రోడ్డు పైకి చేర్చారు.

 

– రెండేళ్ల నుండి చల్లపల్లి స్వచ్చోద్యమ సహకారిగా ఉంటున్న, సొంత పని మీద శివరామపురం వచ్చిన-T.V.9 సుబ్రహ్మణ్యం గారు తమ పిల్లలతో సహా వచ్చి స్వచ్చంద సేవలను తిలకించారు.

 

– సుందరీకరణ కర్తలు మరి కొన్ని చెట్లను అందంగా రూపొందించారు.

 

 పంచాయతీ E.O. బొల్లినేని ప్రసాద్ గారు ఎవరైనా పారిశుధ్య కార్మికులు రాని  రోజున ఎలా సర్దుబాటులు చేసి, కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నదీ వివరించి, ముమ్మారు స్వచ్ఛ సంకల్ప నినాదాలు పలికి, కార్యకర్తలతో పలికించి, 6.40 నిముషాలకు నేటి గ్రామ సేవను ముగించారు.

రేపటి మన స్వచ్ఛ, శుభ్రతా విధుల కోసం శివరామపురం దారిలోని ‘కత్తుల సాన’ ఇంటి దగ్గర కలుద్దాం.

 

         మరామత్తుకు సహకారం?

ఒక్క ఊరు మరామత్తుకు ఎంతలేసి ప్రణాళికలు!

జన వాహిని జాగృతికై జరుగు ఇన్ని ప్రయత్నాలు!

ఏ లాభం- ఏ స్వార్ధం- ఏ భవితకు ప్రస్థానం?

చల్లపల్లి ప్రజల నుండి సమకూడెన సహకారం?

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 07/08/2019

చల్లపల్లి.

14.08 కు శివరాంపురమ్ వంతెన వద్దMrng (6) Mrng (8) Mrng (10)రెస్క్యూటీమ్ వారు పగుగొట్టే బండలుMrng (13)Mrng (2) Mrng (3) Mrng (12) Mrng (14) Mrng (15) Mrng (16) Mrng (19) Mrng (20)Mrng (22) Mrng (25)చెత్త లోడింగ్ చేస్తున్న మహిళాకార్యకర్త1 (6)నాటిన మొక్కలకు కర్రలు కడుతున్న కార్యకర్తలు1 (10)టీవీ9 లో పనిచేసే కోపల్లి సుబ్రహ్మణ్యం గారు 1 (3) 1 (7) 1 (9) 1 (11) 1 (12) 1(17) 1(20) 1(22) 1(24) 1(25) 1(26)1(28) 1(29) 1(30)1 (15)1(19)1(18)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *