స్వచ్ఛ సుందర చల్లపల్లి – 08/08/2019 (1731* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1731* వ నాటి వివరాలు.

ఈ నాటి వేకువ 4.05 – 6.08 నిముషాల మధ్య జరిగిన స్వచ్ఛ-శుభ్ర-సుందర చర్యలలో శ్రమించిన ధన్యులు 29 మంది.

– ఒకటి రెండు మార్లు వరుణ దేవుని పలకరింపులున్న ఈ చల్లని శుభోదయంలో శివరామపురం-7 వ నంబరు పంట కాల్వ వంతెన- మేకల డొంక మధ్య దారి కిరుప్రక్కల చూపరుల నాకట్టుకొనే ప్రశంసనీయమైన కృషి జరిగింది. 15-18 మంది అడుగెత్తున పెరిగిన తాడి మొక్కల నడుమ ఇరుక్కొన్న ఖాళీ మద్యం సీసాలను, ప్లాస్టిక్ సంచుల్ని, చెత్తా చెదారాలను,  తాగేసిన కొబ్బరి బోండా(ఇవే ఈ ఋతువులో దోమల ఉత్పత్తి కేంద్రాలు)లను వంగి-లాగి-ఊడ్చి-ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి తరలించారు.

– విపత్తుల నిర్వహణ దళం ఈ రోజు మురుగు కాల్వ దగ్గరి పని బదులు శివరామపురం దారి ప్రక్క పొలాల్లో రాలిపడు తున్న వేలాది అరముగ్గిన తాడి పండ్ల తాజా సువాసనల నాస్వాదిస్తూ అక్షరాలా ట్రాక్టరు కాయలు ఏరి, ట్రాక్టర్ నింపి డంపింగ్ కేంద్రానికి చేర్చి, సదరు రైతుల శ్రమను కొంత తగ్గించారు.

– సుందరీకరణ బృందం వారు కూడ రంగుల-బొమ్మల నినాదాల- పనుల బదులు ఇక్కడే అసలే హరిత సుందరంగా ఉన్న చెట్ల కొమ్మలు కత్తిరించి, మరింత సుందరీకృతం చేశారు.

గోళ్ల వేంకటరత్నం గారి ‘యశోదా నందన్’ దుకాణ ఉద్యోగిని కోమలి దుర్గ గారు కొత్తగా నేటి గ్రామ సేవలో పాల్గొన్నారు.

స్వచ్ఛ సైన్యం లో భాగస్తురాలైన తన అనుభూతిని, 4 వ తేదీ ఆదివారం నాటి 6 కి.మీ. నడక అనుభవాన్ని వివరించి, ఇక ముందు క్రమం తప్పకుండ గ్రామ బాధ్యతలో పాలు పంచుకోగలనని ప్రకటించారు.

డ్రైవర్ ఆనంద రావు గారికి శాస్త్రి మాష్టారి ద్వారా రెయిన్ కోటు ను అందచేయడం జరిగింది.

నాయుడు మోహన రావు గారు ముమ్మారు పలికి, పలికించిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో 6.40 నిముషాలకు నేటి మన గ్రామ బాధ్యతలకు చెల్లు.

రేపటి మన కర్తవ్య నిర్వహణ కోసం శివరామపురం లోని మేకల డొంక సమీపంలో BSNL దిమ్మ వద్ద కలుసుకుందాం.

 

         స్వచ్ఛ సుందర దీర్ఘ సేవలు?!

అచింతనగా- అచేతనగా- అనారోగ్యపు అనాదృతిగా

అనాలోచిత-ఆకాలోచిత-అసౌకర్యోచిత గ్రామ పౌరులు!

అనూహ్యంగా- అమేయంగా-అనునయంగా- అవిరళంగా-

అభేద్యంగా-సుసాధ్యంగా- సుదీర్ఘంగా స్వచ్ఛ సేవలు!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 08/08/2019

చల్లపల్లి.

14.05 కు శివరాంపురమ్ రోడ్డులోMrng (1) Mrng (2)రాలిన తాడి పండ్లను ఏరుతున్న కార్యకర్తలుMrng (3) Mrng (4) Mrng (5) Mrng (6) Mrng (7) Mrng (8) Mrng (9) Mrng (10) Mrng (12) Mrng (14)1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (6) 1 (9) 1 (14) 1 (17) 1 (20) 1 (21) 1 (22)డ్రైవర్ ఆనందరావు గారికి రెయిన్ కోటు అందిస్తున్న శాస్త్రి మాష్టారు1 (28) 1 (29) 1 (30) 1 (32) 1 (34)1 (36) 1 (38) 1 (39)రేపటి కార్యక్రమం జరిగే చోటు1 (7) 1 (8)సువర్ణ గన్నేరు పూలతో అందంగా ఉన్న శివరామపురం రోడ్డు1 (26) 1 (33)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *