స్వచ్ఛ సుందర చల్లపల్లి – 09/08/2019 (1732* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1732* వ రోజు సేవలు.

నేటి ఆహ్లాదకర శుభోదయంలో 4.12 – 6.10 నిముషాల మధ్య తమ గ్రామ విధులను నెరవేర్చిన ధన్యులు 30 మంది.

– మేకలడొంక, కత్తిసానల పాక మధ్య శివరామపురం దారికి రెండు ప్రక్కల వందలాది తాడి చెట్ల పై నుండి రాలిపడే వేలకొద్దీ కాయలను, ఎండుటాకులను, ఖాళీ మద్యం సీసాలను, ప్లాస్టిక్ సంచుల్ని, కొన్ని ఇతర వ్యర్ధాలను లాగీ, ఊడ్చి, ఏరి, ట్రాక్టర్ కెత్తి చెత్త కేంద్రానికి తరలించిన కొందరు,

– సక్రమం కాని కొమ్మలు తొలగించి, పాదులు సరిచేసి, కొత్తగా మరికొన్ని పూల మొక్కలు నాటుతున్న మరికొందరు.

– రోడ్డు మీది దుమ్ము, చెత్త ఊడ్చి ట్రాక్టర్ లో కెత్తుతున్న వారు కొందరు,

– పిచ్చి, ముళ్ళ మొక్కల్ని నరికి, లోడింగ్ చేసి, సంతసిస్తున్న వారు కొందరు,

     వీళ్ళందరి కర్తవ్య నిష్టను, సేవాసార్ధకతను కొలవడం, పరోపకారతత్త్వాన్ని గణించడం నాకు సాధ్యం కావడం లేదు!

ఎక్కడో పుట్టి, చల్లపల్లిలో మెట్టి – ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ కి అంకితమైపోయిన – దేసు మాధురి సకుటుంబంగా నేటి స్వచ్చతా సందడిలో పాల్గొని, తన 33 వ జన్మదినమును కార్యకర్తల మధ్య జరుపుకొని, “మనకోసం మనం” ట్రస్టుకు 1000/- విరాళమందించినందుకు ధన్యవాదాలు. కనీసం ఇంకొక 67 జన్మదినోత్సవ వేడుకలనిలాగే ఆమె జరుపుకోవాలని కార్యకర్తల ఆకాంక్ష. తన భార్య పుట్టిన రోజు సంధర్భంగా దేసు ప్రభాకరరావు గారు కార్యకర్తలందరికీ అల్పాహార విందును ఇచ్చారు. వారికి ధన్యవాదములు.  

            వాసన కృష్ణారావు గారు కార్యకర్తలందరికీ తమ ఇంట్లో తయారుచేసిన “తాడి  ఇడ్లీలను” పంచారు.

   జన్మదిన కార్యకర్తకు శతమానం భవతి!

     6.40 నిముషాలకు మాధురి సాధికారంగా ముమ్మార్లు చెప్పి, చెప్పించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో నేటి సేవలకు స్వస్తి, రేపటి సేవలు విజయవాడ రోడ్డులోని ప్రభుత్వాసుపత్రి, విజయా కాన్వెంట్ మధ్య ఉన్న రోడ్డులో.

              ఐ‌దో లేక పదేళ్లకైనా:

ప్రజా మోదం లభిస్తున్నది – సజావుగ కధ నడుస్తున్నది

ఐదుకాక పదేళ్ళకైనా- అన్ని గృహముల – అన్ని మనసుల

స్వచ్చ భావన కుదురుకొనదా? చల్లపల్లి సమస్త దేశపు

ప్రగతి దారుల చిహ్నమై తన భవిత బంగరు బాట కాదా?

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 09/08/2019

చల్లపల్లి.

14.13 కు శివరాంపురం రోడ్డులో
3తాటికాయలు ఏరుతున్న కార్యకర్తలు
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17Desu Madhuriఎక్కడో పుట్టి, చల్లపల్లిలో మెట్టి – ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ కి అంకితమైపోయిన – దేసు మాధురి సకుటుంబంగా నేటి స్వచ్చతా సందడిలో పాల్గొని, తన 33 వ జన్మదినమును కార్యకర్తల మధ్య జరుపుకొని, “మనకోసం మనం” ట్రస్టుకు 1000/- విరాళమందించినందుకు ధన్యవాదాలు. జన్మదిన కార్యకర్తకు శతమానం భవతి! 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *