స్వచ్ఛ సుందర చల్లపల్లి – 15/08/2019 (1738* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1738* వ నాటి ఆదర్శాలు.

 ఈ వేకువ 3.56-6.00 నిముషాల మధ్య బందరు రహదారి మెరుగుదల కృషిలో భాగస్వాములు 31 మంది.

– దాదాపుగా అందరూ చీపుళ్లకు మాత్రమే పని చెప్పారు. నలుగురు మాత్రం గోకుడు కర్రలతో దారి ప్రక్కల రంగు రాళ్ల మట్టిని శుభ్ర పరిచారు. మసీదు దగ్గర నుండి 6 వ నంబరు కాల్వ దాక బందరు రహదారి స్వచ్ఛ సుందరంగా- నేత్రానందంగా కనిపిస్తున్నది. సన్న చినుకుల నడుమ నేటి స్వచ్ఛతా విన్యాసాలు సాగినవి.

– నాలుగైదు పూల కుండీల అమ్మకం కేంద్రాల దగ్గర ఉన్న ఆకులు తొలగించి, ఊడ్చిన దుమ్ము- ఇసుక- మరికొన్ని వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి చెత్త కేంద్రానికి తరలించారు.

కాఫీ సేవానంతర సమావేశంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీ లత గారి చల్లపల్లి పర్యటననూ, స్వచ్ఛ సుందర చల్లపల్లికి, కార్యకర్తల కృషికి ఆమె అభినందనలను ప్రస్తావించారు.

 ఈ 73 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రం మచిలీపట్నం లో కలెక్టర్ గారు ప్రదానం  చేయనున్న అవార్డును అందుకొనుటకు కార్యకర్తలు కొందరు 10.00 కు బయలుదేరనున్నారు.

ఒక ప్రత్యేక కార్యకర్త జానీ తొందర తొందరగా ముమ్మార్లు పలికిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను పునరుచ్చరించి నేటి గ్రామ కర్తవ్య నిర్వహణకు ముగింపు పలికారు.

రేపటి మన స్వచ్చంద శ్రమదానం  కోసం మేకల డొంక వద్ద  కలుసుకుందాం.

   రణ నినాదం

ఎన్ని రోజుల స్వచ్ఛ సేవల కెంత భిన్న విభిన్న వర్ణన

లెందరో స్వచ్చంద సైనికు లందరూ నా కవిత కర్హులు

ఒక్కరిద్దరు నేల కొరిగిన ఓడిపోవున స్వచ్ఛ సమరం?

సమయ దానం- త్యాగ శీలం స్వచ్ఛ సుందర రణ నినాదం!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 15/08/2019

చల్లపల్లి.

13.56నిలకు బందరు రోడ్డు లోని మసీదు వద్ద3 4 6 9 50bba8b3-bc1f-430a-a449-ec1bbcbe1ede1 4 5 6 87

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *