స్వచ్ఛ సుందర చల్లపల్లి – 17/08/2019 (1740* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1740* వ నాటి శ్రమదాన వివరాలు.

 నేటి ప్రభాత సమయ గ్రామ బాధ్యతలు నిర్వర్తించిన ధన్యులు 25 మంది కార్యకర్తలు మద్యదుకాణ సమీపం – శివరాంపురం మార్గం. సమయం : 4.05 – 6.25 నిముషాల మధ్య

 – వీరిలో కొందరు దారికి రెండువైపుల పెరుగుతున్న గడ్డి పీకి, పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు తొలగించి, ప్లాస్టిక్ సంచులు, తదితర వ్యర్ధాలను సేకరించి ట్రాక్టర్ లో నింపగా –

– మరికొందరు గతంలో తాము నాటి, పెంచిన చెట్ల కొమ్మల్ని కత్తిరించి, వాటి పాదుల్ని సరిచేశారు.

– మిగిలిన వారు కొత్తగా 40 పాదులు త్రవ్వి, ఖాళీ ఉన్న ప్రతి చోట బోగన్ విలియా మొక్కలు నాటారు.

          పంచాయతి కార్యదర్శి బొల్లినేని ప్రసాద్ గారి కొత్త సమాచారం –

స్వచ్చ చల్లపల్లి సందర్శనకు, అధ్యయనానికి నేడు రావలసిన ‘స్వచ్చాంధ్ర మిషన్’ వారు వరద ఉదృతి వలన బుధవారం రానున్నారట.

స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు గర్జించిన కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు గారు ఆగష్టు 15 నాటి అభినందన పత్ర స్వీకరణను గూర్చి ప్రస్తావించి, రిటైరై ఖాళీగా ఉన్న తాను ఇందరు కార్యకర్తల సేవల సందడిలో పాల్గొనకపోతే, ఈ నాలుగేళ్ళు స్వచ్చ సేవలో గడపకపోతే గతించి ఉండేవాడనేమో అని ఉద్వేగానికి లోనయ్యారు.

రేపటి మన కర్తవ్య నిర్వహణ గూడ శివరాంపురం దారిలోని మద్యం దుకాణాల దగ్గర.       

 

         గ్రహించగల్గిన వారికి….

నిరాడంబర సేవలిచ్చట – నీతి బ్రతుకుల జాడలిచ్చట  

ప్రజాసేవల పద్దతిలిచ్చట – జన్మసార్ధక మార్గమిచ్చట

ఆత్మ తృప్తికి దారియిదియని – అద్భుతాల ప్రయాణమిదియని

చల్లపల్లిలో నిత్యసేవలు సాగె నీ ఐదేళ్ళ నుంచీ!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 17/08/2019

చల్లపల్లి.

14.05 కు మేకలడొంక వద్ద 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34మొక్కలను వాలిపోకుండా క్రమపద్ధతిలో కట్టారు 35 36 37 38 39

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *