స్వచ్ఛ సుందర చల్లపల్లి – 18/08/2019 (1741* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1741* వ నాటి వార్తలు.

 ఈ వేకువ 4.05 – 6.05 నిముషాల మధ్య శివరామపురం దారిలో మద్యం దుకాణాల నుండి చల్లపల్లి దిశగా జరిగిన స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్న వారు 31 మంది.  

 – కొందరు రొయ్యల మేత మిల్లు నుండి దారికిరువైపుల ఉన్న ప్లాస్టిక్ సంచులు, మద్యం సీసాలు, ఇతర చెత్త చెదారం ఏరి, ఊడ్చి, ట్రాక్టర్ లో ఎత్తుతుంటే….  

– చెట్ల కొమ్మలు ట్రిమ్ చేసి, వాటి పాదుల్ని చక్క దిద్ది, అచ్చటి గడ్డిని, పిచ్చి మొక్కల్ని తొలగిస్తున్న వారు కొందరు…

– మిగిలిన వారు కొత్తగా 48 పాదులు త్రవ్వి పాత మొక్కల మధ్య ఖాళీలు చూచుకొని, 48 బోగన్ విలియా మొక్కలు నాటారు.

          ఇక ముందీ పూల శోభలు, చెట్లహరిత వర్ణంతో పోటీ పడాలన్నమాట.

          నేడు స్వచ్చ సైనికులతో ధ్యాన మండలి వారు, లయన్స్ క్లబ్బు వారు కలిసి శ్రమించారు.

          శ్రమదానం పిదప జరిగిన సమావేశంలో రెండు నెలల ఎడబాటు తర్వాత కర్ణాటక నుండి వచ్చి, కార్యకర్తలతో చేయి కలిపిన వేమూరి అర్జునరావు గారు కొంచెం సందిగ్ధంగా ముమ్మారు పలికి, పలికించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో 6.35 నిముషాలకు నేటి కర్తవ్య నిర్వహణ పరిసమాప్తి.

          చివరగా కార్యకర్తలందరికి, సమీపంలోని మరో ఇద్దరికి కూడ మంచి అల్పాహార, కాఫీ పానీయాలు అందించారు.

          రేపటి మన స్వచ్చంద శ్రమదానం చల్లపల్లి ప్రధాన కూడలిలో.

   1700 రోజుల….

కోడి పందెములతోనె కొందరి కెక్కును కిక్కు

రంజు రాజకీయాల్లోనె రాణింతురు మరికొందరు

స్వచ్ఛ కార్యకర్తలెమొ స్వగ్రామం సేవలలో

1700 రోజుల సేవల పండుగలో మునిగుందురు!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 18/08/2019

చల్లపల్లి.

1శివరాంపురం దారిలో ని మద్యం దుకాణాల వద్ద 4.05నిలకు 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *