స్వచ్ఛ సుందర చల్లపల్లి – 24/08/2019 (1747* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1747* వ నాటి కబుర్లు.

              నేటి వేకువ 4.00 – 6.05 నిముషాల మధ్య బందరు దారిలోని S.B.I- S.R.Y.S.P  కళాశాల ప్రాంతంలో మాతృ గ్రామ కర్తవ్యం నిర్వహించిన ధన్యులు 34 మంది.

– కళాశాల ప్రహరీ వెలుపల తోటలో నిన్న మిగిలిన పనిని 20 మంది కార్యకర్తలు నేడు ముగించారు. కానుగ, వేప చెట్ల కొమ్మలను నరికి, అనవసరమైన కలుపు, పిచ్చి మొక్కలు, తీగల్ని తొలగించి, ట్రాక్టర్ లోని కెక్కించి, డంపింగ్ కేంద్రానికి తరలించారు. రంగు రాళ్ల మీద దుమ్ము, ఇసుక మరొక సారి ఊడ్చి శుభ్ర పరిచారు.

– ఏడుగురు కత్తి వీరులు రవి క్లినికల్ లాబ్ ప్రక్కన వికృతంగా పెరుగుతున్న ఖాళీ స్తలంలోని ముళ్ల- పిచ్చి-మొక్కలను, తీగలను నరికి, తుక్కును బైటకు లాగి, శుభ్రపరిచారు.

– మిగిలిన వారు చీపుళ్లకు పని చెప్పి, రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు దారి కిరుప్రక్కల తుక్కును, ప్లాస్టిక్ సంచుల్ని, దుమ్మును మళ్లీ ఊడ్చి రోడ్డును ఆకర్షణీయంగా మార్చారు.

నేటితో ఈ ప్రాంతంలో స్వచ్ఛ -శుభ్ర-సుందరీకరణలు ముగిసినట్లే.

హార్వర్డ్ యూనివర్సిటీ  పరిశోధకుడు, ప్రస్తుతం కాన్సర్ విభాగ ఔషధ శాస్త్రవేత్త ఉడత్తు నళినీ కుమార్ నేటి సేవలో పాల్గొనడం, చెత్త గంపల్ని మోసి, ట్రాక్టర్ లోకి ఎత్తడం నేటి విశేషం, మనకు స్ఫూర్తిదాయకం.

భోగాది వాసు ముమ్మారు ఎలుగెత్తి చాటి, కార్యకర్తలందరితో పలికించిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో 6.35 నిముషాలకు నేటి స్వచ్చంద బాధ్యతలకు స్వస్తి.     

రేపటి శుభోదయ సేవల కోసం 4.00 కు గంగులవారిపాలెం దారిలోని మత్తి- నల్లూరి వారి ఇళ్ల మధ్య కలుసుకొందాం.

పిచ్చి వాళ్ల స్వర్గం.

రాజకీయులు-బుద్ధి జీవులు-రాటుదేలిన సంఘ సేవకు

లనేకానేకులు- ప్రముఖులు అనుసరించిన-ఆచరించిన

సుదీర్ఘ కాలం సాగుచుండిన- స్వచ్ఛతా పరిమళములద్దిన

స్వచ్ఛ సుందర సేవలనగా పిచ్చివాళ్ల స్వర్గమేనా?

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 23/08/2019

చల్లపల్లి.

14.05 కు రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద2 324 2612 154 5 6 7 8 9 10 11 13 16 18 20 21 2328 33 34 35 36 37 39 423031పూలతో అందంగా ఉన్న తోట444543 40 38కత్తి బృందం41

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *