స్వచ్ఛ సుందర చల్లపల్లి – 25/08/2019 (1748* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1748* వ నాటి అనుభవాలు.

నేటి వేకువ 4.00 – 6.10 నిముషాల మధ్య గంగులవారిపాలెం దారిలో గ్రామ బాధ్యతలలో పాల్గొన్నవారు 31 మంది.

– వీరిలో ఐదారుగురు రోడ్డు కు పడమర వైపున్న మట్టి తో అక్కడి ఎత్తు పల్లాలను సమం చేశారు. కొమ్మల్ని ట్రిమ్ చేసి, ఆహ్లాదమయం చేశారు.

– కత్తులకు పని చెప్పిన వాళ్లలో కొందరు సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు కిరువైపుల డ్రైను ను కమ్మివేసిన చెట్లను, కొమ్మల్ని, పిచ్చి చెట్లను, తీగల్ని నరకగా, గొర్రుల వారు వాటిని పోగులు చేసి, ట్రాక్టర్ కెత్తి, చెత్త కేంద్రానికి తరలించారు.

– మిగిలిన వారు గంగుల పాలెం వైపుగా దారి ప్రక్కల ప్లాస్టిక్ సంచులు ఏరి, కలుపు పీకి, ఊడ్చి, శుభ్ర పరిచారు.

గ్రామంలోని మిగిలిన రోడ్ల కన్న ప్రస్తుతం స్వచ్ఛ సుందరంగా రూపొందిన ఈ దారిని ఇలాగే కాపాడుకోవాలనే కోరిక ఈ రోడ్డు ప్రక్క వారికి కొంత ఉండడం హర్షణీయం!

స్థానిక మహిళలు వేకువనే కొన్ని బాధ్యతలు పంచుకోవడమే దీనికి నిదర్శనం.

పద్మావతీ ఆసుపత్రి రిసెప్షనిస్టు లక్ష్మీ సెల్వం ముమ్మారు ప్రకటించి, అందరిచే అనిపించిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో 6.35 నిముషాలకు నేటి కృషి సమాప్తం.

కొన్నాళ్ల ఎడం తర్వాత వచ్చిన అడపా గురవయ్య గారు జీవన సత్యాలను వినిపించారు.

సుదీర్ఘ కాలం గ్రామ ప్రజలకు వైద్య సేవలందించిన RMP డాక్టరు- దివంగత కోటేశ్వరరావు గారి సంస్మరణ కార్యక్రమానికి సుమారు 12.00 కు బైపాస్ మార్గంలోని (భారత లక్ష్మీ రైస్ మిల్ వద్ద) వారి ఇంటి దగ్గర మనం కలుద్దాం.

రేపటి మన సేవలు యధావిధిగా చల్లపల్లి ప్రధాన కూడలి దగ్గరే.

  A.T.M. సెంటరు

ఇతర సంగతట్లుంచితె- ఏ‌.టి.యం. సెంటరుంది

ఒక ప్రక్కన రెండు గుడులు-మరో వంక మెస్ లున్నవి

అందువలన ఆ జాగా వ్యర్ధాలకు కేంద్రమే!

స్వచ్ఛ సైన్య సేవలతో అది కూడా ధన్యమే!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 25/08/2019

చల్లపల్లి.

14.00నిలకు. గంగులవారిపాలెం దారిలో3 4 7 8 9 18 19 20 21 22 23 25 26283845 46 4739 37

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *