స్వచ్ఛ సుందర చల్లపల్లి – 26/08/2019 (1749* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1749* వ నాటి సేవా విన్యాసం.

    ఈ చల్లని వేకువ 3.57 – 6.00 మధ్య 20  మంది కార్యకర్తల స్వచ్ఛ-శుభ్ర చర్యలు సంభవించాయి.

      స్తలం: చల్లపల్లి గ్రామ ప్రధాన కూడలి.

  – మూడు దారుల సంగమంలోను, నాగాయలంక దారివైపుగా కొద్ది దూరం దాక ఊడ్చి శుభ్రపరిచారు.

– బందరు మార్గంలో పెట్రోలు బంకు మీదుగా ATM సెంటరు, రెండు దేవాలయాల ప్రాంతం దాక ప్లాస్టిక్ సంచులు, ఏరి, ఊడ్చి, ట్రాక్టర్ లోకి ఎత్తి, ప్రధాన చెత్త కేంద్రానికి తరలించారు. ఆ వ్యర్ధాలలో చచ్చిన పంది కొక్కులు కూడ ఉన్నాయి.

– పంచాయతి వారి మురుగుతీత యంత్రం రోజూ పని చేయడం వల్ల డ్రైన్లు సజావుగానే పారి, స్వచ్ఛ సైనికులకు కొంత శ్రమ తగ్గింది. పంచాయతి కార్మికుల కృషితో వీధుల పారిశుద్ధ్యం మెరుగు పడి, దోమల, ఈగల అదుపు కనిపిస్తున్నది.

ప్లాస్టిక్ వాడకం కూడ గణనీయంగా నియంత్రణ లో కనిపిస్తున్నది. పంచాయతి కార్మికులు, ఉద్యోగులకు అభినందనలు!

నేటి కార్యక్రమంలో ధ్యాన మండలి సభ్యులు కూడా పాల్గొన్నారు.

వడ్డే బ్రహ్మేశ్వర రావు గారు తమ కుటుంబ సభ్యుల తరపున  స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కోసం తమ వంతు సాయంగా “ మనకోసం మనం” ట్రస్టుకు 5000/- విరాళాన్ని అందించారు.  వీరు గత సంవత్సరం కూడా 5000/-రూపాయలను అందించారు.  వీరికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు. 

అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 17 సంవత్సరాల నుంచీ నడపబడుతున్న మెడికల్ క్యాంపులో గత సంవత్సరం నుండీ 5000/- చొప్పున విరాళం ఇస్తున్నారు.

గోళ్ల వేంకట రత్నం గారు ఉచ్ఛ స్వరంతో ముమ్మారు చాటి, కార్యకర్తల గళాలలో ప్రతి ధ్వనించిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో 6.30 నిముషాలకు నేటి స్వచ్చంద సేవకు విరామం.

రేపటి మన గ్రామ బాధ్యతల కోసం గంగులవారిపాలెం మార్గంలో కలుసుకొందాం.

                      20 పైగా ఊళ్లకు….

ఘంటశాలకు- అవనిగడ్డకు-కడమ 20పైగ ఊళ్లకు

శుద్ధి మంత్రం జపిస్తుండే బుద్ధి జీవికి, సేవకులకు

స్వచ్ఛ స్ఫూర్తిని అందజేస్తూ-ఉద్యమాలకు సహకరిస్తూ

చల్లపల్లి స్వచ్ఛ సైన్యం సాగె ఐదారేళ్ల నుండీ!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 26/08/2019

చల్లపల్లి.

1ప్రదాన కూడలి వద్ద 3.58ని4 5 7 8 9 1113 14 15 18 19 20 21 2246cb21e4-cac4-4261-aa2e-3a63f811cccf5000/-విరాళం అందిస్తున్న బ్రహ్మేశ్వర రావు గారు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *