స్వచ్ఛ సుందర చల్లపల్లి – 27/08/2019 (1750* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1750* వ రోజు ప్రయత్నాలు.

ఈ మంగళవారం ఉదయం 4.01 – 6.05 నిముషాల మధ్య గంగులవారిపాలెం మార్గంలో జరిగిన స్వచ్చంద శ్రమదానంలో భాగస్వాములు 34 మంది.

   ఇవి ద్విముఖ సేవలు.

– ఏడెనిమిది మంది సుందరీకరణ విభాగం వారు మా ఇంటికి, దారికి మధ్య స్తలంలో గడ్డి పీకి, చదును చేసి, పూల మొక్కలు పెట్టారు. ప్రహరీని దాటి బైటకు పెరిగిన చెట్ల కొమ్మలు కత్తిరించారు.

– ఖడ్గ ధారులకు ఈ రోజు సరిపడా పని దొరికింది. రోడ్డు మార్జిన్ లోని, ప్రక్క స్తలంలోని పిచ్చి-ముళ్ల మొక్కల్ని, తీగల్ని నరికి, అశుభ్రతను, వైకల్యాన్ని తగ్గించారు. అసలే అందంగా ఉన్న దారిని మరింత స్వచ్ఛ సుందరంగా రూపొందించారు.

– నాలుగేళ్ల క్రితం నాటి, బాగా పెరిగిన చెట్ల కొమ్మల్ని తొలగించి, ఆహ్లాదకరంగా మార్చారు. ఇంకొక మూడు రోజుల తర్వాత- ఈ మార్గం పునర్నవీకరణ పూర్తయ్యాక- ఇంత వరకు ఇటు రాని గ్రామస్తులు వచ్చి పరిశీలించి పరవశించవచ్చు.

అంతకుముందెప్పుడో పాల్గొని, ఈ మధ్య కుదరక రాని ఐదుగురు స్థానిక మహిళలు నేడు పాల్గొని, ఉత్సాహంగా శ్రమించడం నేటి విశేషం. అందులో ఒక కార్యకర్త  నేమాల పార్వతి  గారు పట్టుదలతో ముమ్మారు చెప్పిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలకు కార్యకర్తలంతా బదులు పలికి 6.30 నిముషాలకు నేటి స్వచ్చ కృషికి స్వస్తి పలికారు.

అంతకు ముందు ఉడత్తు రామారావు గారి బిస్కెట్ల-ప్రసాద పంపకం, BSNL నరసింహరావు  గారి తిరుపతి లడ్డు ల పంపకం జరిగినవి.

రేపటి మన స్వచ్చంద శ్రమదానం ఈ గంగులవారిపాలెం దారిలోనే.

ఇదే ఇక ఆదర్శ మార్గం.

20 వేల ప్రజల స్వస్త తె ఇక మనందరి ప్రథమ సూత్రం

దుమ్ము ధూళిని- దోమ లీగల తరిమి కొట్టుటె దాని మార్గం

స్వచ్ఛ సైన్యం నిత్య కృషికై సర్వ గ్రామం కదలి వస్తే

స్వచ్ఛ సుందర చల్లపల్లి కి మంచి రోజులు వచ్చి నట్లే!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 27/08/2019

చల్లపల్లి.

14.01 కు గంగులవారిపాలెమ్ రోడ్డులో2 4 5 6 7 8 1011 12 13 14 1517 18 19 20డ్రైన్ లో ఉన్న మట్టిని తీస్తున్న కార్యకర్త21 23 24 26 27 28 29 30 33 34 35 31

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *