స్వచ్ఛ సుందర చల్లపల్లి – 28/08/2019 (1751* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1751* వ నాటి కర్తవ్య నిర్వహణ.

ఈ  ఉదయం 4.03 – 6.06 నిముషాల మధ్య గంగులవారిపాలెం మార్గంలోని భవఘ్ని నగర్ లో జరిగిన 3 వ రోజు శ్రమదాతలు 38 మంది. మహిళలతో సహా స్థానికులు 9 మంది ఉత్సాహంగా పాల్గొనడం ఒక ప్రత్యేకత.

– ఎక్కువ మంది కార్యకర్తలు దారి ప్రక్క గడ్డి, పనికి రాని పిచ్చి- ముళ్ల మొక్కల్ని, తీగల్ని నరికి, పోగు చేసి, ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ కేంద్రానికి తరలించారు. ఒకరిద్దరు రోడ్డు ప్రక్క నాలుగేళ్ల క్రితం నాటి, బాగా పెరిగి-అడ్డొస్తున్నచెట్ల కొమ్మల్ని నరికారు. తూర్పు వైపున గల ఖాళీ స్తలంలోని చిట్టడవి వంటి గుబుర్లను నరికి, శుభ్ర పరిచారు. డ్రైను కడ్డుపడుతున్న మొక్కల్ని బురద నీటిలో దిగి మరీ తొలగించారు.

సుదీర్ఘంగా-1751 దినాల నుండి గ్రామంలో స్వచ్ఛ సైన్యం నిరంతరంగా సాగిస్తున్న ఈ స్వచ్ఛ పోరాటం స్ఫూర్తి వంట పట్టని గ్రామస్తులింకా మిగిలి ఉండటం ఆశ్చర్యకరమే!

–  మా ఇంటి ముందటి ఖాళీ జాగాలో నిన్నటి స్వచ్ఛ సుందరీకరణ నేడు కూడ కొనసాగింది.

వానలకు మొలిచిన గడ్డిని చెక్కి, రకరకాల పూల మొక్కలు నాటారు. ఎక్కువగా పెరిగిపోతున్న పెద్ద చెట్ల కొమ్మలు కొన్నిటిని కత్తిరించారు. వన్నెలకే వన్నెలు, అందాలకే అందాలు దిద్దుతున్న వీరి కృషిని కీట్సు-షెల్లీ మహాకవులు వచ్చి చూడగలిగితే బాగుంటుంది.

– నేటి శ్రమ దానంలో ధ్యాన మండలి, లయన్స్ క్లబ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు కస్తూరి  వర ప్రసాదు గారు గర్జా సదృశంగా పలికిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను మిగిలిన కార్యకర్తలు ముమ్మారు పునరుచ్చరించి 6.35 నిముషాలకు నేటి గ్రామ కర్తవ్యానికి స్వస్తి పలికారు.

‘తానా’ పూర్వ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ (USA) గారితో తాను నిన్న ప్రస్తావించిన ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ ముచ్చట్లను డాక్టర్ డి.ఆర్.కె.ప్రసాదు గారు వివరించారు.

రేపటి మన స్వచ్ఛ బాధ్యతల కొనసాగింపు గంగులవారిపాలెం దారి మలుపులో.

ఔను- అదిగో మంచికాలం

ఏళ్లు-వూళ్లు నిరర్ధకంగా ఎవరి దయకై ఈ నిరీక్షణ?

స్వయం కృషితొ-సమిష్టి శ్రమతో- స్వచ్ఛ సైన్యం దారి చూపిన

గ్రామ సేవా దీక్షతో ఇక కలుపు హస్తం తక్షణం

స్వచ్ఛ సుందర చల్లపల్లికి వచ్చినట్లే మంచి కాలం!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 28/08/2019

చల్లపల్లి.

14.03 కు గంగులవారిపాలెమ్ రోడ్డులో2 3 4 5 6 7 8 9 1012 1314 15 16 18 201721 22 25 27 28 3032నిన్న29నేడు35 3432 33

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *