స్వచ్ఛ సుందర చల్లపల్లి – 02/09/2019 (1756* వ రోజు)

1

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1756* వ నాటి శ్రమ – సమయదానం.

ఈ పర్వదిన ఉషోదయాన –  సాంప్రదాయక భక్తి వెల్లివిరిసి, గ్రామస్తులు గుడులలో దైవదర్శనాలకు సమాయత్తులౌతున్న వేళ 4.00 – 6.05 నిముషాల మధ్య చల్లపల్లి గ్రామ భక్తులైన ఈ 28 మంది స్వచ్చ కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్డులో 3 రకాల బాధ్యతలు నిర్విర్తించారు.

  1. 18 మంది కత్తులు, గొర్రులు, చీపుర్లు వాడి, ఆదారి చివర వంతెన దాక పిచ్చి – ముళ్ళ మొక్కలు, తీగలను నరికి, పొందిక కోసం పెద్ద చెట్టు కొమ్మలు కత్తిరించి, ఆ తుక్కుల్ని బండ్రేవుకోడు కాల్వ గట్లకు రక్షణగా సర్ది తమ గంటన్నర శ్రమతో గత వారం రోజుల స్వచ్చ – శుభ్ర – సుందరీకరణను ఒక కొలిక్కి తెచ్చారు.
  1. ముగ్గురు భవఘ్నినగర్ దారి ప్రక్క గడ్డిని తరిగి, కిలోమీటరు మేర రోడ్డులో ఏ చిన్నలోపమూ లేకుండ చూశారు.
  1. సుందరీకరణ బృందం ఆసుపత్రి ఉత్తర దిశ దారిలో ఖాళీలను పూరించి, మద్రాసు కనకాంబరం మొక్కలు నాటి, ప్రధాన రహదారికి కూడ కొన్ని మెరుగులు దిద్దారు.

రోడ్లు ఊడ్చే యంత్రాన్ని మెకానిక్ కృష్ణ గారు తయారుచేసి ఈరోజు తీసుకువచ్చారు. డా. పద్మావతి గారు జెండా ఊపి ప్రారంభించారు. కార్యకర్తలందరూ కృష్ణ గారిని అభినందించారు.  

ఎడతెగక పడుతున్న సన్నవానలో ఆనందిస్తూ, పండుగ వేళ ఈ 28 మంది నిస్వార్ధ – ప్రజోపయోగకర చర్యలకు నీరాజనాలు వద్దు గానీ – గుర్తించి, గ్రామస్తులంతా అనుసరించడం అవసరం కాదా?

        అడపా గురవయ్య విస్పష్టంగా ముమ్మారు ధ్వనించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలు అందరు కార్యకర్తలలో ప్రతిధ్వనించి, గురవయ్య, వాసుల ప్రవచనాలతో 6.30 నిముషాలకు ఈ స్వచ్చ బాధ్యతలు ముగిసినవి.

          రేపటి కర్తవ్యం కోసం చల్లపల్లి ప్రధాన కూడలి (మెయిన్ సెంటర్) వద్ద కలుద్దాం.

కధలు కధలుగ – పరంపరగా

ఘర్మజల సాక్ష్యముగ జరిగే కర్మవీరుల స్వచ్చ సేవలు

కాల్పనిక చరితములు కావవి – కాశి మజిలీ కధలు కావవి

స్వచ్చ సైన్య సుదీర్ఘ సేవలు జాతికొక ఆదర్శమనదగి

పరంపరగా – కధలు కధలుగ భావితరములు చదువదగినవి!  

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 02/09/2019

చల్లపల్లి.

2 4am కు గంగులవారిపాలెం రోడ్డులో

3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *