స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03/09/2019 (1757* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1757* వ నాటి వివరణలు.

ఈ ఉదయం 4.00 – 6.00 మధ్య గ్రామ ప్రధాన కూడలి దగ్గర వీధి పారిశుద్ధ్యంలో పాల్గొన్న ధన్యులు 23 మంది.

చవితి పండుగ వ్యర్ధాలను నిన్న మధ్యాహ్నమే రెండు ట్రాక్టర్ల తో సోదర గ్రామ పారిశుద్ధ్య కార్మికులు తరలించక పోతే ఈ రోజు చిత్తడి వానకు నేలకంటుకు పోయి స్వచ్చంద కార్యకర్తలకు మరింత కష్టమయ్యేది. పండుగ మరునాడు ప్రధాన వీధులింత శుభ్రంగా నిర్వహిస్తున్న స్వచ్చంద మరియు పంచాయతి కార్మికులకు అభినందనాలు!

పెట్రోలు బంకుల ప్రాంతాలు, ఏ.టి.యం. సెంటరు, కూరగాయల కొట్లు షాబుల్ బజారు దాక ఈ ఉదయం కూడ ట్రాక్టరు నిండా వ్యర్ధాలు దొరకడమూ విశేషమే. నేడు అవసరార్ధం కొంత సేపు ఈ చెత్త బండిని ప్రముఖ వైద్యుడు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు నడపడం మరొక విశేషం!

  ఇందరు గ్రామ ప్రముఖులు, వృద్ధులు, స్త్రీలు 1757 రోజులుగా- ఈ చలి గాలిలో-వానలో గ్రామ స్వచ్ఛ, శుభ్రతల కోసం పరితపించి, పరిశ్రమించడాన్ని ఇప్పటికీ కొందరు గ్రామస్తులు పట్టించుకోరా? ముందుకు రారా?

యడ్ల రాము గారు కోపాన్నెలా అదుపు చేసుకోవాలనే ఒక సూత్రాన్ని చెప్పి, స్వచ్ఛ -సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు చెప్పి, అందరిచే చెప్పించి 6.25 నిముషాలకు నేటి స్వచ్చంద బాధ్యతలను ముగించారు.

రేపటి సుప్రభాత శ్రమదానం కోసం గంగులవారిపాలెం దారిలో కలుద్దాం.

  స్వచ్ఛ సేవల కర్మ వీరులు.

ఎవ్వరీ స్వచ్చంద సేవకు?లెవరూ ఎవరీ కర్మ వీరులు?

ఇన్ని నాళ్లుగ- ఇన్ని ఏళ్లుగ ఎందుకొరకీ గ్రామ సేవలు?

స్వార్ధమెరుగని ప్రజా సేవలు?..అనుచు అచ్చెరువొందునట్లుగా

చల్లపల్లి స్వచ్ఛ వీరులు సాగిరైదారేళ్ల నుండీ!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

వారం – 03/09/2019

చల్లపల్లి.

14.01కు సెంటర్లో

23 4 5 6 7 8 9ఖాన్ గారి ఇంటి వద్ద పడిపోయిన వేప చెట్టును సరి చేస్తున్న కార్యకర్తలు10 11 12 13 14 15 16 17 18 1920 21

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *