స్వచ్ఛ సుందర చల్లపల్లి – 04/09/2019 (1758* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1758* వ నాటి కబుర్లు.

నేటి వేకువ 4.00 – 6.05నిముషాల మధ్య సన్న ముసురు వాన మధ్య గంగులవారిపాలెం మార్గంలో రెండు చోట్ల జరిగిన శ్రమ దానంలో పాల్గొన్నది 23 మంది.

  రెండు మూడు చీపుళ్లకు తప్ప కత్తులకు, గొర్రులకు చాలా వరకు విశ్రాంతి.

– శాయి నగర్ ప్రధాన వీధి మొదట్లో రెండు రకాల పూల మొక్కలు నాటి, అచటి గడ్డిని తొలగించినారు. ఇంకా మిగిలిన ఖాళీ లలో గోగు-పుల్ల బచ్చలి-పాల కూర, బెండ విత్తులు నాటారు.

– ఎక్కువ మంది దారి చివరి మలుపు- వంతెనల మధ్య బోగన్ విలియా, సువర్ణ గన్నేరు, సన్ ఫ్లవర్ కొత్త బ్రీడ్, బిళ్ల గన్నేరు వంటి రకరకాల పూల మొక్కల్ని నాటారు. ఈ రోజుతో గంగులవారిపాలెం దారిలో స్వచ్ఛ సుందరీకరణ పరి పూర్ణమైనట్లే. సుమారు 150మొక్కలు ఈ ఒక్క రోజు నాటారు.

ఈ బుధవారం సేవలో లయన్స్ క్లబ్ మిత్రులు కూడా పాల్గొన్నారు. 8 వ తేదీ ఆదివారం నాటి ‘ఘంటసాలకు నడక’ గురించి కొంత చర్చ తర్వాత రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద వృక్ష వివాహ సందర్భంగా భోజనాలకు కార్యకర్తలనాహ్వానించి, లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు కస్తూరి ప్రసాద్ గారు ముమ్మారు చెప్పిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించిన కార్యకర్తలు నేటి స్వచ్ఛ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు.

 రేపటి స్వచ్చంద శ్రమదానం కోసం విజయవాడ మార్గంలోని 6 వ నబరు కాలువ దగ్గర కలుసుకొందాం.

లయన్స్ క్లబ్ ప్రస్తుతాధ్యక్షులు శ్రీ. T. సాంబశివరావు గారు ప్రతి నెలా ఇచ్చే 500/-చందాను ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.  

                ఎందుకంటే…..

ఇన్ని వేల దినాలుగ ఎందుకొ ఈ తాపత్రయం?

ఇంతమంది సేవకులకు ఎవరిచ్చిరి దిన భత్యం?

తీర్ధానిక? స్వార్ధానిక? దేశ ప్రజల గుర్తింపుక?

ఒక ఆశయ పరిపూర్తి కె- ఒక్క ఆత్మ తృప్తి కొరకె!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 04/09/2019

చల్లపల్లి.

1గంగులవారిపాలెమ్ రోడ్డులో

     23

4 5      68 79 10 1112 1316 17

69413531_2095126200795464_6118534852816928768_n18

శుభ్రం చేయక ముందు

20 21

శుభ్రం చేసిన తర్వాత

19

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *