స్వచ్ఛ సుందర చల్లపల్లి – 05/09/2019 (1759* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1759* వ రోజు విశేషాలు.

 

 4.13 – 6.05 నిముషాల మధ్య ఈ ఉషోదయంలో గ్రామ బాధ్యతలు పంచుకొన్న కార్యకర్తలు 26 మంది.

విజయవాడ మార్గంలో 6 వ నంబరు కాలువకు ముందు, వెనుక రెండు ప్రక్కల ముసురు వానలకు చిక్కుగా పెరిగి, అల్లుకొన్న పిచ్చి-ముళ్ల మొక్కల్ని, తీగల్ని తొలగించి, ఇతర వ్యర్ధాలతో గలిపి, ఊడ్చి, ట్రాక్టరు లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

నాలుగేళ్ల క్రిందట ఇదే చోటొక కంపు గొట్టే మినీ చెత్త కేంద్రం. ఇప్పటి ఈ దారిలో స్వచ్ఛత, పచ్చదనం, పూల మొక్కల పలకరింతలు గమనిస్తే “కృషితో నాస్తి దుర్భిక్షం”, “ శ్రమ మూల మిదం జగత్ “ అనే సూక్తుల కర్ధం తెలిసి వస్తున్నది.

– ఈ వేకువ గంటన్నర పాటు వంతెనకు ఉత్తర-ఎడమ వైపున స్వచ్ఛ సుందరీకరించిన-నట్టిల్లు వలె కనిపించే చోటుకు సుందర కర్తలు అభినందనీయులు!  కార్ల షెడ్డు వారు తమ ఎదుట రోడ్డు ను శుభ్రంగా ఉంచడం అవసరం.

తన తిరుపతి యాత్రను వివరించి, ప్రసాదాన్ని పంచి, ముమ్మారు స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలు ప్రకటించిన గోళ్ల కృష్ణకు బదులు పలికి కార్యకర్తలు 6.30 కి నేటి గ్రామ బాధ్యతలు ముగించారు.

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో సర్వేపల్లి రాధా కృష్ణ గారి సూక్తులు గుర్తు చేసిన గురవయ్య గారు1000/-, వేముల శ్రీనివాస్ గారు 500/-, కోడూరు వేంకటేశ్వర రావు గారు 520/- “ మనకోసం మనం”ట్రస్టుకు విరాళాలు సమర్పించినందుకు ధన్యవాదాలు.

రేపటి స్వచ్ఛ సుందరీకరణ ప్రయత్నం విజయవాడ దారిలోని 6 వ నంబర్ కాల్వ వంతెన దగ్గరే!

   పాద యాత్రల జైత్ర యాత్రకు…!

స్వచ్ఛ సుందర చల్లపల్లిని చారిత్రాత్మక ఘంటశాలను

రామనగరం-పుచ్చగడ్డ-రాచ దేవర కోటకుండా

ముడి బిగించే స్వచ్ఛ సూత్రం-‘ స్వచ్ఛ సైన్యం పాదయాత్ర’ కు

కదలి రండీ! విజయవంతంగా ముగిద్దాం జైత్రయాత్రను!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 05/09/2019

చల్లపల్లి.

14.13 కు 6వనెంబరు కాలువ వద్ద23 5 6 7 9 10 11 12 13 14 15 16417 19 20 21 22 24 26 2936 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 500/- ట్రస్టుకు ఇస్తున్న వేముల శ్రీను గారు37 520/-రూపాయలను ఇస్తున్న కోడూరు వేంకటేశ్వర రావు గారు381000/- రూపాయలను అందిస్తున్న గురవయ్య మాష్టారు18 23 25 30 31 32చల్లపల్లి అందాలు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *