స్వచ్ఛ సుందర చల్లపల్లి – 06/09/2019 (1760* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1760* వ నాటి సేవ స్ఫూర్తి.

6 వ నంబరు పంట కాలువ- విజయా కాన్వెంట్ ల మధ్య విజయవాడ దారి కిరుప్రక్కల 4.05 – 6.10 నిముషాల మధ్య నేటి సుప్రభాత గ్రామ బాధ్యతా నిర్వహణ లో పాల్గొన్నది 29 మంది.

– 16 మంది దాక నేడు కత్తులకే పని చెప్పారు. డ్రైన్ల లోని తుక్కు, ఎంగిలాకులు, ప్లాస్టిక్ సంచులు, కత్తుల వాళ్లు నరికిన పిచ్చి-ముళ్ల మొక్కలు గొర్రులతో లాగి ఐదారుగురు ట్రాక్టర్ కెత్తి, చెత్త కేంద్రానికి తరలించారు. చెట్ల ట్రిమ్మింగ్ తో వచ్చిన కొమ్మలు, రెమ్మలు మాత్రం డ్రైను లోకి కోసుకు పోయిన మట్టి వల్ల ఏర్పడిన గుంటల్లో సర్ది, మన్ను కప్పి వేశారు. ఇప్పుడు చేసినంత మేర విజయవాడ మార్గం విశాలంగా కన్పిస్తున్నది.

– సుందరీకరణ బృందం రోడ్ల ప్రక్క గుంటలు పూడ్చి చదును చేసి త్వరలో మళ్లీ నాటబోయే మొక్కలకు సిద్ధం చేసింది.

చిట్టూర్పు కు చెందిన సామాజిక మాధ్యమ సృజనశీల ద్వయం-యలమంచిలి సుధారాణి , ఆమె కొడుకు భరత్ నేటి స్వచ్ఛ సైన్యం సేవలను సవివరంగా వీడియో చిత్రీకరణ చేశారు.

కాఫీ సేవానంతరం జాతిపిత విగ్రహం సాక్షిగా 10 నిముషాల పాటు జరిగిన సమావేశాన్ని కూడ చిత్రీకరించారు.

ఆదివారం ఘంటశాల దాక జరగనున్న స్వచ్ఛతా నడకను గూర్చి కూడ చర్చించారు.

శివరామ పురం గ్రామస్తుడు బాల దుర్గా రామ్ ప్రసాద్ ముమ్మారు పలికి, అందరితో పలికించిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో  6.45 నిముషాలకు నేటి కార్యక్రమం ముగిసింది.

రేపటి ఔత్సాహిక గ్రామ స్వచ్ఛ సుందరీకరణలు గాంధీ విగ్రహ పరిసరాలలోనే.

ఘంటశాలకు పాద యాత్రలు.

జనం మనకూ-మనం జనులకు స్వచ్ఛతా సందేశ మిస్తూ

స్వచ్ఛ హృదయం-ధృఢ శరీరం సాధనలుగా అడుగులేస్తూ

స్వచ్ఛ సుందర ఉద్యమాలకు ఆట పట్టగు రెండు ఊళ్లను

పాద యాత్రతొ కలిపి వేద్దాం! ప్రగతి దారుల నిలిపి చూద్దాం!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 06/09/2019

చల్లపల్లి.

14.05 కు 6 వ నెంబరు కాలువ వద్ద2 3 4 5 6 7 8 9 12 13 14 15

16 17 18 19 20 21 22 23

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *