స్వచ్ఛ సుందర చల్లపల్లి – 07/09/2019 (1761* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1761* వ నాటి దృశ్యాలు.

4.05 – 6.05 నిముషాల మధ్య విజయవాడ రోడ్డు కుడి ప్రక్క Z.P.హైస్కూల్ ఆవరణలో జరిగిన నేటి ఉషోదయ కార్యక్రమం లో వివిధ రకాల భాగస్వాములు 33 మంది.

ఆవరణలో ఉత్తర ప్రహరీ నుండి మొదలు పెట్టిన ఒక బృందం 17 మంది చిట్టడవి లా పెరిగిన అనేక రకాల వ్యర్ధమైన మొక్కల్ని, గడ్డిని తొలగించే ఖడ్గ చాలన విద్య ప్రదర్శిస్తే, మరికొందరా తుక్కును, మద్యం సీసాలను పోగులు పెట్టారు.

మరొక బృందం పాఠశాల గేటు లోపల పింగళి వేంకయ్య విగ్రహం ప్రక్కన పిచ్చి-ముళ్ల మొక్కల్ని , గడ్డిని తొలగించి, గొర్రులతో లాగి, చీపుళ్ల తో శుభ్రపరిచారు.

మన సృజనాత్మక కార్యకర్త వాసన కృష్ణారావు అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన రోడ్లు ఊడ్చే పరికరాన్ని కార్యకర్తలంతా నిశితంగా పరిశీలించారు.

SBI విశ్రాంత శాఖాధిపతి శ్రీ పృధ్వీశ్వర రావు గారు (మల్లెమాల రచించి-P.సుశీల పాడిన) అసలైన తెలుగు పాటలతో కార్యకర్తల శ్రమను మరపించారు. చేతి సంచుల్ని గుర్తుచేసి, వాహన కాలుష్యాన్ని తగ్గిద్దామనీ, హరిత వేడుకల్ని ఆచరిద్దామని వివరించారు.

డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు రేపటి ‘ఘంటశాలకు స్వచ్ఛతా నడక’ ను గూర్చి వివరించారు.

కార్యశూరత తప్ప, వాక్శూరత లేని వాసన కృష్ణారావు ముమ్మారు గాంధీ విగ్రహం సాక్షిగా పలికి, పలికించిన స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలతో 6.50 నిముషాలకు నేటి స్వచ్చంద శ్రమదానం ముగిసింది.

రేపటి ఘంటసాలకు నడక కోసం 4.00 కు  పద్మావతి హాస్పిటల్ దగ్గర కలుసుకొందాం.

రాష్ట్రమంతటి ఎంపిక

సమస్త దేశం ఒప్పుకొన్నది- చల్లపల్లే స్ఫూర్తి దాతని

ఆంధ్ర దేశం ఎంచుకొన్నది- స్వచ్ఛతకు ఒక నమూనా అని

స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమలు-చెమటలె వెన్నుదన్నని

జైత్ర యాత్రల స్వచ్ఛ సైన్యం సాగె గత ఐదారేళ్ల నుంచీ!

 

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 07/09/2019

చల్లపల్లి.

14.06 కు గాంధీ విగ్రహమ్ వద్ద2 3 4 5 6 7 8 9 10

12 15 16 17 18 19 20 2113 14సువర్ణ గన్నేరు పూలతో అందంగా ఉన్న బైపాస్ రోడ్డు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *