స్వచ్ఛ సుందర చల్లపల్లి – 09/09/2019 (1763* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1763* వ నాటి పనులు.

          ఈ ప్రాతః సమయం 4.08 – 6.08  నిముషాల మధ్య విజయవాడ మార్గంలోని 6 వ నంబరు కాల్వ కుడి గట్టున జరిగిన శుభ్ర – సుందరీకరణలో భాగస్వామ్యులు 22 మంది.

          6 వ నంబరు కాల్వ – కె. సి. పి. వ్యవసాయ క్షేత్రం గేటుల నడుమ డ్రైన్ లోని ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ సంచులు, పిచ్చి – ముళ్ళ మొక్కలు వంటివి ఏరి, లాగి, నరికి, పోగులు చేసి, ట్రాక్టర్ కెత్తి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు. పూర్వమెప్పుడో తామే నాటి, పెంచిన చెట్లను, పూల మొక్కల్ని ట్రిమ్ చేసి, పాదులు సరిజేశారు. పై వ్యర్ధాలన్నింటిని గొర్రులతో పోగులు చేసిన వారు నలుగురు.

          మరో ఇద్దరు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ప్రహరీ గోడ ప్రక్క కొత్తగా పాదులు త్రవ్వి, తెల్ల పూల గుత్తుల మొక్కల్ని నాటారు.

          కాఫీ సేవనం పిదప ధైనందిన స్వచ్చ చర్యల సమీక్షలో

1) నిన్నటి ఘంటశాల వరకు స్వచ్చ పాదయాత్రను,

          2) నేటి, రేపటి ఈ నెలాఖరు వరకూ చేయదగ్గ పనులనూ చర్చించారు.

          3) డాక్టరు. DRK ప్రసాదు గారు అమెరికాలో నాదెళ్ళ సురేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్చ చల్లపల్లి మారధాన్ లను, కోడూరు, నాగాయలంకల స్వచ్చోద్యమాలను వివరించి, ఆగస్టు మాసానికి గాను ‘మనకోసం మనం ట్రస్టు’ జామా ఖర్చులను చదివారు. ఈ ఆగష్టు నెలలో ట్రస్టుకు 189000/- లోటును ప్రకటించారు.

పురిటిగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలనాగేశ్వర శర్మ గారు నిన్నటి పాదయాత్ర ప్రయోజనాన్ని విశ్లేషించి, ముమ్మారు నినదించిన స్వచ్చ సుందర సంకల్పాలను కార్యకర్తలు ముక్తకంఠాలతో ఉచ్చరించి 6.40 నిముషాలకు నేటి తమ గ్రామ బాధ్యతలు ముగించారు.

          రేపటి మన స్వచ్చ కృషి గూడ KCP వ్యవసాయ క్షేత్రం దగ్గరే ఉంటుంది.

 

                    ఎక్కువ తక్కువలు

ఎవరు తక్కువ – ఎవరు ఎక్కువ స్వచ్చ సుందర సైనికులలో

ఎవరి త్యాగములెంత గొప్పవి – ఈ సమగ్ర మహోద్యమంలో

అనే చర్యలు కార్యకర్తల కసలు ఉదయించకుండానే

స్వచ్చ సైన్యం జైత్ర యాత్రలు సాగె నీ ఐదేళ్ళ నుండీ!

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 09/09/2019

చల్లపల్లి.

1 4.08 కు 6వ  నెంబరు కాలువ వద్ద2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 Vijayawada Road 1 Vijayawada Road 217 అందంగా ఉన్న విజయవాడ రోడ్డు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *