స్వచ్ఛ సుందర చల్లపల్లి – 16/09/2019 (1770* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1770* వ నాటి స్వచ్చ సుందర ప్రయత్నం.

          ఈ నాటి సుప్రభాత సమయం 4.00  నుండి  6.00 మధ్య గ్రామ ముఖ్య కూడలి వద్ద జరిగిన స్వచ్చ శుభ్ర ప్రయత్నంలో 33 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

          నాగాయలంక దారిలోని పొట్టి శ్రీరాములు వీధి నుండి ఉభయ పెట్రోల్ బంకుల మీదుగా ATM సెంటరు దాక రెండు రోడ్లు, వాటి కుడి ఎడమల మార్జిన్లు, షాపుల ముందు భాగాలు, టిఫిన్ బళ్ళ చుట్టు ప్రక్కలు ఊడ్చి, అన్ని రకాల వ్యర్ధాలను ఏరి, ఊడ్చి, ఆ కల్మషాలన్నిటినీ డిప్పలతో ట్రాక్టర్ లో కెత్తి, చెత్త కేంద్రానికి తరలించారు. ఇందులో ATM కేంద్రమే ఎక్కువ సమయాన్ని తీసుకుంది.   

దుమ్ము సేకరణ యంత్రం నిర్విరామంగా బందరు మార్గంలో పనిచేయడం వల్ల ఈ శ్రామికుల కష్టంలో కొంత తగ్గిందనుకోవాలి. చీపుళ్ళు, గొర్రులకు తప్ప, కత్తులు, పారలు, గొడ్డళ్ళకు నేడు పనిదొరకలేదు.

     అన్నపూర్ణ, పల్నాటి భాస్కర్ లతో బాటు శాయి గారు, మరికొందరు ముస్లిం యువకులు వారానికొక రోజు తమ వీధి సుందరీకరణం నిన్న 22 వ ఆదివారం జయప్రదంగా సాగింది. ప్రస్తుతానికీ విషయంలో ఇదొక ఒంటరి వీధి!  

తొలుత పల్నాటి అన్నపూర్ణ ముమ్మారు తమ గ్రామ స్వచ్చ సుందరీకరణ ధృడ సంకల్పాన్ని నినదించగా కార్యకర్తలంతా తగురీతిలో బదులు పలికి, 6.20 నిముషాలకు నేటి తమ గ్రామ విధులకు స్వస్తి పలికారు.

      ఐతే అప్పుడే ఇంటి దగర్నుండి నడిచి వచ్చిన మన 80 ఏళ్ల స్వచ్చ వృద్ధ బాలుడు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు కూడ మళ్ళీ ఆ నినాదాలిచ్చారు.

          రేపటి స్వచ్చ దినచర్య కోసం మునసబు గారి వీధి మొదట్లో 4.00 కు కలుద్దాం.

 

          పిచ్చి వాళ్ళ స్వర్గమేనా?

ప్రజామోదం లభిస్తుంటే – భాగస్వామ్యం పెరుగుతుంటే-

గృహిణులూ – విద్యార్ధులూ ఇదే గొప్ప మార్పని మెచ్చుకుంటే –

మరో నాల్గేళ్ళ పిదపైనా గ్రామమంతా కదలి వస్తే –

స్వచ్చ సుందర చల్లపల్లి పిచ్చి వాళ్ళ స్వర్గమేనా?

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 16/09/2019

చల్లపల్లి.

1 ప్రధాన కూడలి వద్ద2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

శుభ్రంగా ఉన్న మెయిన్ రోడ్డు 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *