స్వచ్ఛ సుందర చల్లపల్లి – 17/09/2019 (1771* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1771* వ నాటి స్వచ్చ విన్యాసాలు.

          ఈ ఉదయం 4.01  నుండి  6.05 నిముషాల మధ్య 24 వేల మంది ప్రజలున్న చల్లపల్లి గ్రామంలో – మునసబు గారి వీధి  నుండి సన్ ఫ్లవర్ పాఠశాల దాక జరిగిన స్వచ్చంద సేవలో పాల్గొన్నది 31 మంది!

డంపింగ్ కేంద్రానికి తరలిన చెత్త ఒక పెద్ద ట్రాక్టర్. ట్రక్కు. దారికి రెండు ప్రక్కల పెరిగిన పిచ్చి మొక్కలు, రోడ్డు వైపుకు పెరిగిన పెద్ద చెట్ల కొమ్మలు, ప్లాస్టిక్ సీసాలు, మద్యం సీసాలు, ఇతరేతర వ్యర్ధాలన్నీ తొలగిపోయి, పచ్చని చెట్లు, పూల మొక్కలు మాత్రమే మిగిలిపోయిన కనువిందైన మునసబు బజారును ఇప్పుడు తిలకించవచ్చు.   

సన్ ఫ్లవర్ పాఠశాల పరిసరాలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు, శుభ్రపరుచుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ విద్యాసంస్థ మూలమలుపులోని ఖాళీ స్థలం ఈ రోజు 20 మంది కార్యకర్తల కత్తులకు పని కల్పించింది. రోడ్లను ఊడ్చిన వారు కొందరు, నరికి, ఊడ్చిన తుక్కంతా ట్రాక్టర్ కెత్తిన వారు కొందరు. వానలకు, వాహన సంచారాలకు రోడ్లు, మార్జిన్లు, దుమ్ము పేరుకొనడంతో ఈరోజు ఎక్కువ దూరం పని సాగలేదు.

ఈ స్వచ్చ సైన్యం ప్రధాన ఆశయాలు రెండు : తమకు చేతనైనంత వరకు గ్రామాన్ని స్వచ్చ సుందరంగా తమ శ్రమతో మార్చడం, తమ గ్రామస్తులను తమ సుదీర్ఘ స్వచ్చ కృషి ద్వారా చైతన్యపరచడం. మొదటి దాంట్లో వీరికి నూటికి 90 మార్కులు, రెండోది మాత్రం పాక్షిక విజయం!

ముత్యాల లక్ష్మి గారి మనుమరాలి మొదటి పుట్టిన రోజు వేడుక (శాదీఖానాలో)కు – రేపు మద్యాహ్నం 11 – 1 గం. మధ్య స్వచ్చ కార్యకర్తలందరి ఆశీర్వచనాలకు, విందుకూ ఆహ్వానం. హనుమకొండ దుర్గా ప్రసాదు గారు ముమ్మారు నినదించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో 6.20 కి నేటి స్వచ్చ సేవ ముగిసింది.

     రేపటి మన గ్రామ సేవ సన్ ఫ్లవర్ స్కూలు నుండి మొదలు.    

          పిచ్చి వాళ్ళ స్వర్గమౌనా?

ఇది ప్రేరణ – ఇది సాంత్వన – వేల మంది కాస్వాదన

ఇదొక స్ఫూర్తి – ఇదొక కీర్తి – ఇదె గ్రామం ఆరాధన

ఇది వేల దినాల నుండీ వినుతించిన ఆచరణ

స్వచ్చ చల్లపల్లి సేవ పిచ్చి వాళ్ళ స్వర్గమేనా?

– నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 17/09/2019

చల్లపల్లి.

1 4.01 కు మునసబు గారు విధి మొదట్లో2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *