స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1793* వ నాటి సంగతులు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1793* వ నాటి సంగతులు.

నేటి ఉషోదయానికి పూర్వమే 4.00-6.00 మధ్య విజయవాడ మార్గంలో- చతుశ్చక్ర వాహనాల కాటా సమీపంలో- జరిగిన రహదారి స్వచ్చ- శుభ్ర-సుందరీకరణ ప్రయత్నంలో 27 మంది కృతకృత్యులయ్యారు.

దారి ప్రక్కల-ముఖ్యంగా పడమర దిక్కున ఉన్న మురుగు కాల్వను, దాన్ని కమ్మేస్తున్న కొమ్మలను, పిచ్చి తీగలను, చిందర వందరగా అల్లుకు పోతున్న ముళ్ల పూలతీగలను,గడ్డిని నరికి, కత్తిరించి, పీకి, ఊడ్చి, ట్రాక్టర్ లో కెక్కించడమంటే నేను వ్రాస్తున్నంత తేలిక కాదు. ఆ చిమ్మ చీకట్లో కంపు గొడుతున్న డ్రైను లో దిగి, వ్యర్ధ దరిద్రాలను చేతులతో ఒడ్డు నున్న వారికందించి, లోపలి గట్టు మీది మొక్కల్ని- గడ్డిని శుభ్రపరచడం చల్లపల్లి స్వచ్చ సైనికులు కాక ఎవరు చేయగలరు?

ఎవరో నరికి అడ్డ దిడ్డంగా పడేసిన తాడి చెట్లను డ్రైను గట్టున అందంగా పేర్చడానికి ఎంత చెమట చిందించారో గమనించాను.

ఒక బోగన్ విలియా పూల మొక్క మరీ గుబురుగా-ఏపుగా పెరిగి, తన బరువుకు తానే డ్రైను లోకి వంగిపోతే దాన్ని నిలిపి, ఊత కర్రలు బిగించి, కొమ్మలు ట్రిమ్ చేసి, పాదుల్లో ఎర్ర మట్టి తో చెట్టు మొదలుకు ఊతం ఇచ్చేందుకు 40 నిముషాలు శ్రమించిన నలుగురు స్వచ్చ పని మంతులకు అభినందనలు!

  దగ్గరలోనే చెత్త కేంద్రముండగా ఈ మురుగు కాల్వనే మరొక చెత్త- గబ్బు కేంద్రంగా మారుస్తున్న సమీప గృహస్తులకు, అపార్ట్ మెంట్స్ నివాసులకు స్వచ్చ సుందర చల్లపల్లి మీద ఇప్పటి నుంచైనా కాస్త జాలి చూపవలసిందిగా విన్నపం!

ఈ రెండు గంటల శ్రమ తరువాత కాటా ప్రదేశంలో జరిగిన సమావేశంలో నిబద్ధ కార్యకర్త ఆకుల దుర్గా ప్రసాద్ ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ సుందర ధృఢ సంకల్పాన్ని కార్యకర్తలు పునరుద్ఘాటించి, 6.30నిముషాలకు తమ ఈ నాటి స్వచ్చ దీక్షను ముగించారు. అంతకముందు అడపా గురవయ్య 1930 నాటి గాంధీ గారి నిరాహార దీక్షను, బ్రిటీష్ వారి కుయుక్తుల్ని గుర్తుచేశారు.

ఈ మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో నేటి వధువు వక్కలగడ్డ లక్ష్మీ సుహాసిని ఏర్పాటు చేస్తున్న హరిత విందుకు, వీలైన వాళ్ళు తెనాలి దగ్గర వైకుంఠపురంలో జరిగే వివాహ (7.00 కు) వేడుకకు హాజరౌదాం.

  రేపటి మన శ్రమదానం కోసం విజయవాడ రోడ్డులో – కాటా దగ్గరే కలుసుకుందాం.

 

       స్వచ్చోద్యమ సందేశం

అనుక్షణం కాలుష్యం హద్దు మీరి పోతుంటే –

పంచభూతములను కూడ పట్టిమ్రింగి వేస్తుంటే –

ఎవరెవరో రావాలని జనం ఎదురు చూస్తుంటే –

స్వచ్చోద్యమ మవతరించె – చాలవరకు చక్కదిద్దె!    

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 09/10/2019

చల్లపల్లి.

1 4.06 కు  విజయవాడ రోడ్డులో2 3 4 5 6 7 8 9 10 1112 13 14 15 16 18 19 20 17 పడిపోయిన బోగన్ విలియా చెట్టును సరిచేస్తున్న కార్యకర్తలు22 బోగన్ విలియా చెట్టును సరిచేసిన తరువాత23 2421కార్యకర్తల శ్రమతో పచ్చగా, అందంగా, శుభ్రంగా కనిపిస్తున్న విజయవాడ రోడ్డు26 కార్యకర్తల శ్రమతో పచ్చగా, అందంగా, శుభ్రంగా కనిపిస్తున్న విజయవాడ రోడ్డు27కార్యకర్తల శ్రమతో పచ్చగా, అందంగా, శుభ్రంగా కనిపిస్తున్న విజయవాడ రోడ్డు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *