స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1794* వ నాటి శ్రమ దాన సంగతులు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1794* వ నాటి శ్రమ దాన సంగతులు.

చల్లగా ఉన్న ఈ శుభోదయంలో 4.07-6.05 నిముషాల మధ్య జరిగిన స్వగ్రామ బాధ్యతా నిర్వహణలో 27 మంది పాల్గొన్నారు. కార్యరంగం విజయవాడ మార్గంలోని ‘వాహన కాటా’ సమీపం.

   నేడు కూడ ఎక్కువ మందికి పనికల్పించింది దారికి పడమర దిశలోని మురుగు కాల్వే! ఆ దగ్గరలోని ఇళ్లవారు, వచ్చిపోయే గ్రామస్తులలో, ప్రయాణికులో, అలవోకగా విసురుతున్న నానారకాల వ్యర్ధాలతో నిండిన ఈ కాలువ నడక మరచిపోయి చాలా రోజులైనట్లుంది. అపార్ట్మెంట్ వారి ఏ వ్యర్ధాల ఫలితమో గాని, కంపుగొడుతున్న ఈ కాల్వ గట్లు స్వచ్చ కార్యకర్తలకు పెనుసవాలు!

     కాటాకు ఉత్తరదిశ స్వచ్చ సుందరీకరణ బృందం వాళ్ళ శ్రమను స్వాగతించి, 10 గజాల దూరమే వీళ్ళ గంటన్నర సమయాన్ని తినేసింది. ఐనా అంతిమంగా ఆస్ధలమంతా రేపటి నుండి నాటబోయే పూల మొక్కల కోసం సిద్ధమయింది.

దారికి తూర్పు ప్రక్కన వానలకు పాదుల్లోని మట్టి జారిపోయి, సురక్షితం కాని కొన్ని చోట్లకు పాదుల్లోని మట్టిని నింపి, కొమ్మలను తీర్చిదిద్ది, తాళ్ళతో కట్టి, ఐదారుగురు శ్రమిస్తే, మరికొందరు పిచ్చి చెట్లను, తీగలను, గడ్డిని, కత్తులతో తొలగిస్తుంటే – మహిళా కార్యకర్తలు గొర్రులతో, చీపుళ్లతో తుక్కులాగి, ఊడ్చి సహకరించారు.

   మొన్నటి మహిళా స్వచ్చ కార్యకర్త, నిన్నటి వధువు సుహాసినిగారి వైవాహిక విందు భోజనాలు ప్లాస్టిక్ రహితంగా – పర్యావరణ సహితంగా జరగడం సంతోషదాయకం. గ్రామస్తులందరివి కూడ ఇట్లే హరితవేడుకలుగా ఉండాలని మనవి!

  స్వచ్చ సైన్యంలోని ఒక ‘సమున్నతుడు’ – శివబాబు అత్యున్నతంగా ముమ్మారు నినదించిన, కార్యకర్తలందరి గళాలతో ప్రతిధ్వనించిన మన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో 6.35 కు నేటి మన గ్రామ బాధ్యతలకు స్వస్తి!

     రేపటి తరువాయి కర్తవ్య నిర్వహణ కోసం చిల్లలవాగు సమీపంలో కాటా వద్ద – విజయవాడ రహదారిలో కలుసుకుందాం!

          స్వచ్చ సైన్యం గుండె చప్పుడు.

ఒకడి కోసం ఊరు మొత్తం – ఊరు కోసం ఒక్కడొక్కడు

అపరిశుభ్రత – అసౌకర్యం – అనారోగ్యం తునిమినప్పుడు

గ్రామమంతా స్వచ్చ సుందర బృందగానం పాడునప్పుడు

అదే అసలగు విజయదశమిగ స్వచ్చ సైన్యం గుండెచప్పుడు!  

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 10/10/2019

చల్లపల్లి.

1 4.07 కు కాటా వద్ద2 3 4 5 6 7 8 9 10 11 12 సుందరీకరణకు ముందు28 సుందరీకరణ కు తరువాత  13 14 15 17 18 19 20 21 22 23 24 16 రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లతో అందంగా కనిపిస్తున్న విజయవాడ రోడ్డు25 26 27 29

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *