స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1795* వ నాటి మాననీయ చర్యలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1795* వ నాటి మాననీయ చర్యలు.

          ఈ నాటి ఉషః కాలానికి ముందే 4.10-6.05 నిముషాల నడుమ విజయవాడ మార్గంలోని డంపింగ్ యార్డు సమీపంలో జరిగిన గ్రామ స్వచ్చ – స్వస్త – సుందరీకరణలో పాల్గొన్న శ్రమదాతలు 32 మంది.

దారి పడమర ప్రక్క డ్రైన్ లోని చెత్తను, సిల్టును నిన్న పంచాయితీ కార్మికులు సగం దూరం దాక తొలగించారు. ఈ నాల్గు రోజుల్నుండి శుభ్రపరచిన సుమారు కిలోమీటరు పొడవున – దారికిరువైపుల పాదులు త్రవ్వి, అడవితంగేడు అనే ‘గద్ద గోరు’ పూల మొక్కలను – మూడు రంగుల 80 పూల మొక్కలు నాటడమే నేటి స్వచ్చ కార్యకర్తల ప్రధానసేవ.

   సుందరీకరణ బృందం తమ పని తాము చేస్తుండగానే, మిగిలిన వారు మొక్కలు నాటారు. ఇప్పటికే ఈ రోడ్డు గత నాలుగేళ్లుగా నాటి పెంచుతున్న వందలాది చెట్ల పచ్చదనంతో – మరికొన్ని వందల రంగు రంగుల పూలమొక్కలతో, రంగుల ట్రీ – గార్డులతో అందంగా కనిపిస్తుండగా ఈ రోజు, ఆదివారం నాటే కొత్త పూదోటలతో ఇంకెంత స్వచ్చ – సుందరంగా మారుతుందో చూడాలి.

  ఈ నాటి వ్యర్ధాల తరలింపుకు సమయం చాలంనందున, ట్రస్టు ఉద్యోగులాబాధ్యత నెరవేర్చారు. ఔత్సాహిక ప్రసారమాధ్యమ ఛాయా గ్రాహకుడైన యలమంచలి భరత్, అతని తల్లి గారు నేటి స్వచ్చోద్యమాన్ని చిత్రీకరించారు.

   స్వచ్చ చల్లపల్లి ఉద్యమ వీరాభిమాని ఉదయశంకరశాస్త్రి గారి 50 రోజుల అనంతర పునరాగమం ఈ నాటి ముఖ్య విశేషం. తన ఆరోగ్య విషయాన్ని, ముఖ పుస్తకంలో కార్యకర్తలిక పై చేయదగు పనిని వివరించి, ఉద్వేగంగా, ఆవేశంగా ఆయన ముమ్మారు ప్రకటించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను రెట్టించిన ఉత్సాహంతో పునరుద్ఘాటించిన కార్యకర్తలు 6.30 నిముషాలకు ప్రస్తుత సేవలకు స్వస్తి చెప్పారు. నవంబరులో జరుగవలసిన ఐదేళ్ళ స్వచ్చ చల్లపల్లి వేడుకలను గూర్చి డాక్టర్. దాసరి రామకృష్ణ ప్రసాదు గారు వివరించారు.

        రేపటి మన స్వచ్చంద శ్రమదానం విజయాకాన్వెంట్ ప్రక్క ప్రభుత్వాసుపత్రి మార్గంలో జరిగి, ఆదివారం ఉదయం 4.00 కు పూల మొక్కలు నాటే పనిని డంపింగ్ యార్డు సమీపంలోని విజయవాడ దారిలో కొనసాగిద్దాం.

   శాస్త్రీజీ పునరాగమనం.

స్వచ్చోద్యమ చల్లపల్లి సాధికార ఘనాపాఠి

సామాజిక మాధ్యమాల సముచిత నిత్యవిహారి

అతనికున్న ఒకే స్వప్నం స్వచ్చ రమ్య చల్లపల్లి

పునః పునః స్వాగతం అపూర్వ సదానంద శీలి!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 11/10/2019

చల్లపల్లి.

1 4.12 కు కాటా  వద్ద2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *