స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1797* వ నాటి దృశ్యాలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1797* వ నాటి దృశ్యాలు.

          సందర్భాన్ని  బట్టి పనిలో మార్పు దప్ప – స్వచ్చ సైనికుల పని వేళలో, శ్రమదానంలో మార్పు లేదు. నేటి ఉషోదయానికి ముందే 4.12 – 6.10 నిముషాల మధ్య విజయవాడ దారిలోని చిల్లలవాగు ప్రాంతంలో జరిగిన గ్రామ స్వచ్చ సుందర కృషిలో పాల్గొన్న సేవకులు 36 మంది. నిన్న ఉదయం 4.00 నుండి స్వచ్చ శుభ్రతా చర్యలు, వైద్య శిబిరం చర్యలతో మొత్తం 12 గంటలకు పైగా శ్రమించినా సరే – ఈ పనిరాక్షసులు విశ్రాంతి కోరక – నేటి గ్రామ స్వచ్చ దీక్షను కొనసాగించడం స్వయంగా చూడని వాళ్ళు నమ్మగలరా?

మొన్నటి దాక విజయవాడ దారికి పడమర డ్రైను అశుభ్రత మీద పోరాడిన ఈ సైనికులు ఈరోజు ప్రధానంగా తూర్పు వైపు మురుగు కాల్వను, దాని గట్ల మీద కేంద్రీకరించి, అక్కడి ముళ్ళ- పిచ్చి – నిరర్ధక మొక్కల్నీ , కొమ్మల్నీ, ఎండుటాకుల్నీ, చెప్పలేని కల్మషాలనూ నరికి, పీకి, గొర్రులతో లాగి, ఊడ్చి, తమకు తృప్తి కలిగే దాక ఆ రహదారి అందాలకు, స్వచ్చ శుభ్రతలకు మెరుగులు దిద్దారు. సుందరీకరణ బృందం మాత్రం దారి పడమర దిక్కున తమ ప్రత్యేక శ్రద్దను పెట్టారు.

‘మనకోసం మనం’ ట్రస్టు కార్మికులు నేడు గూడ ఈ దారి కలుష్యాన్ని లొంగదీయడంలో సహకరించారు. జీతం కోసం కాక – స్వచ్చ సుందర చల్లపల్లి రూప కల్పనకై ఇష్టంగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు అభినందనీయులు.

          తేలప్రోలు నుండి ఈ ఊరికి చుట్టంచూపుగా వచ్చిన ఒక పెద్దాయన ఈ స్వచ్చోద్యమ సంరంభాన్ని కొత్తగా – వింతగా – పరిశీలనగా గమనించారు గాని, ఇందరు – ఈ వేకువ సమయంలో – డాక్టర్లు, ఉద్యోగులు, మహిళలు జీతభత్యాలు లేకుండా ఊరి కోసం శ్రమిస్తున్నారనే విషయం మాత్రం నమ్మలేదు!

నేటి విశేషాలలో మరికొన్ని – 20 కి పైగా పూలమొక్కలు నాటడం, 12 రోజుల స్వచ్చ యార్లగడ్డ ఉద్యమ సంచాలకుడు తూము వేంకటేశ్వరరావు గారి స్వచ్చ కృషి, శంకర శాస్త్రి గారి మిఠాయిల పంపిణీ (ఏదో ఒక సందర్భాన్ని తానే సృష్టిస్తారు), కైకలూరు దగ్గరి 101 ఏళ్ల వయసున్న సజీవ ఆజ్ఞాత దేశభక్తుని సామాజికహిత చింతన, తపన గూర్చి అడపా గురవయ్య విశ్లేషణ….. వగైరా.

స్వచ్చోద్యమ చల్లపల్లి కి 10 రోజుల ఎడబాటు తర్వాత వచ్చిన దేసు మాధురి తన బాధను దిగమ్రింగి – నేటి శ్రమ జీవన సౌందర్యం అనుభవించి, తన కొక గుర్తింపునిచ్చిన స్వచ్చోద్యమాన్ని ప్రశంసించి, మహోద్వేగంగా ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను కార్యకర్తలందుకొనడంతో – 6.35 కు నేటి బాధ్యతల ముగింపు.

రేపటి మన స్వచ్చంద శ్రమదానం కోసం చల్లపల్లి మెయిన్ సెంటర్ వద్ద కొనసాగిద్దాం.      

    మంచి నీళ్ళ పోయమట!

బస్టాండులు – రహదారులు – బాగుచేయు సైనికులకు –

వల్ల కాళ్లు – మురుగు డ్రైన్లు వదలని ఈ శ్రామికులకు –

పద్దెనిమిది వందలాది పనిదినాల రాక్షసులకు –

వైద్య శిబిర స్వచ్చ కర్మ మంచి నీళ్ళ పోయమేన?!   

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 13/10/2019

చల్లపల్లి.

12 3 5 6 7 89 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 19 25 2426 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 Gopalakrishnayya garu

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *