స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1798* వ నాటి దృశ్యాలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1798* వ నాటి అడుగులు.

          నేటి బ్రహ్మ్మ ముహూర్తం 4.05 – 6.05 నిముషాల మధ్య గ్రామం కోసం జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 31 మంది బాధ్యులయ్యారు. స్వచ్చ సైన్యం రెండేళ్ల నాటి నిర్ణయం ప్రకారం ప్రతి సోమవారం లాగే నేడు కూడ గ్రామ ప్రధాన కూడలిలోనే కలిశారు.

          నాగాయలంక దారిలోని పెట్రోల్ బంకు మొదలుకుని, బందరు మార్గంలోని సంత బజారు దాక శ్రమించిన వీరు దుమ్ము తమ ముక్కుల్లో దూరకుండ వడపోత చిక్కాలు కట్టుకొని, చీపుళ్లే ఆయుధాలుగా గ్రామ కాలుష్యం పై జరిపిన యుద్ధం దర్శనీయం కాదా? అరకిలోమీటరు పైగా – మూడు రోడ్ల కూడలి, మరో పెట్రోల్ బంకు, ATM కేంద్రం, కూరగాయల అంగళ్లు, చిరుతిళ్ళ అంగళ్ళు, రెండు దేవాలయాల ముందు భాగాలు స్వచ్చ సుందరంగా మారిపోయినవి.

ఈ ప్రాంతంలోని వ్యాపారులు, భక్తులు, టిఫిన్ బళ్ళ వారు, కూరల దుకాణదారులు, వాడకందారులు మరికొంత శ్రద్ద చూపితే ఈ స్వచ్చ శ్రామికుల పని తేలికౌతుంది గదా!

        ఊడ్చి, పోగులు చేసిన వ్యర్ధాలను, చెత్తను, దుమ్ము – ఇసుకలను ట్రాక్టర్ లో నింపుకొని, డంపింగ్ కేంద్రానికి తరలించారు.

అనారోగ్యం వంటి కొన్ని కారణాల వల్ల ఈ మధ్య స్వచ్చ చల్లపల్లి కి కొన్నాళ్లు సుదూరంగా ఉండి, మొన్ననే తిరిగి వచ్చిన ప్రాతూరి ఉదయశంకర శాస్త్రి గారు తన దాన వ్యసనం మానుకోక, తన పెన్షన్ నుండి 10 వేల రూపాయల చెక్కును ‘మనకోసం మనం’ ట్రస్టుకు విరాళమీయడం అభివందనీయం. మరొక స్వచ్చ కార్యకర్త శ్రీ మొవ్వ శ్రీహరి తాను త్వరలో కొడాలి గ్రామంలో గ్రామ సచివుని గా చేరుతున్న సందర్భంలో అందరికీ మిఠాయిలు పంచి, స్వచ్చోద్యమానికి 500/- విరాళం ప్రకటించినందుకు అభినందనలు, ధన్యవాదాలు. ఇక ముందు గూడ వీరి స్వచ్చంద శ్రమదానం చల్లపల్లికి కొనసాగుగాక!

నిశ్శబ్ద – నిరాడంబర – ఆదర్శ స్వచ్చ కార్యకర్త మెండు శ్రీను మనస్పూర్తిగా ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ సుందర సంకల్పంతో ఏకీభవించిన కార్యకర్తలు 6.30 కి నేటి గ్రామ కర్తవ్య దీక్షను విరమించారు.

    రేపటి మన స్వచ్చ సంకల్పాన్ని విజయవాడ మార్గంలోని వాహనాల కాటా సమీపం నుండి అమలుచేద్దాం!

ఉదాహరణ యోగ్యులుగా…

కదం త్రొక్కే స్వచ్చ సైన్యం గ్రామ సేవల మధుర దృశ్యం

స్వచ్చ సుందర చల్లపల్లికి బాట వేసే మహాయజ్ఞం

సాగు ఈ సమకాల ఘటనకు సాక్షులగు మనమందరం

ఉచిత పాత్రలు నిర్వహిస్తూ ఉదాహరణ ప్రాయులౌదాం!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 14/10/2019

చల్లపల్లి.

12 నిన్న రాత్రి షాపుల వారు చెత్తను షాపు బయట వదిలివెళ్ళడంతో వాటిని కుక్కలు ఈడ్చి చెల్లాచెదురు చేసిన దృశ్యం. 3 4 5 6 7 8 9 1011 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 3031 32 33 34 35 Movva Srihari garu మొవ్వ శ్రీహరి గారి 500/- విరాళంSastri garuప్రాతూరి ఉదయశంకర శాస్త్రి గారి 10,000/- విరాళం

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *