స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1799* వ నాటి శుభ్ర సుందర చర్యలు.

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1799* వ నాటి శుభ్ర సుందర చర్యలు.

  1800 రోజులకు అడుగు దూరంలో ఆగిన నేటి శుభోదయంలో 4.05-6.05 నిముషాల మధ్య జరిగిన గ్రామ స్వచ్ఛ సుందర కృషిలో పాల్గొన్న స్వచ్చోద్యమ కారులు 43 మంది.(32+11 మంది రక్షక భటులు). నేటి కాలుష్య వ్యతిరేక కురుక్షేత్రం విజయవాడ మార్గంలోని వాహన కాటాల నుండి చిల్లల వాగు ఉత్తర గట్టు.

  (ప్రతి రోజూ ఏదో నేనిలా వ్రాస్తున్నాను గానీ, చల్లపల్లి స్వచ్ఛ సైనికుల సాహస సేవలను, కాలుష్యం మీద వాళ్ల నిత్య వీర విహారాన్ని, అంకిత భావాన్ని, లక్షలాది ఆలోచనా పరులలో వాళ్లు రగిలిస్తున్న స్ఫూర్తిని పూర్తిగా ఆవిష్కరించడం నాకు సాధ్యం కావడం లేదు.)

అన్ని రోజుల్లాగే నేడు కూడా-దారికి కుడి ఎడమల పిచ్చి-ముళ్ల మొక్కల్ని, పూల మొక్కల పాదుల్లోని గడ్డిని, దారి కడ్డు రాబోతున్న కొన్ని చెట్ల కొమ్మల్ని పీకి, నరికి, పూల తీగల్నీ అందంగా మలచి, త్రాళ్లతో కట్టి గంటన్నరకు పైగా స్వచ్ఛ – శుభ్ర-సుందరీకరణలో నిమగ్నులయ్యారు.

వానలతో రోడ్ల మీద పేరుకుంటున్న మట్టిని, ఇసుకను చెక్కి, గోకి దారిని విశాలంగా-దర్శనీయంగా మార్చారు.

స్వచ్చోద్యమ చల్లపల్లి కి నేటి అతిథులైన 10 మంది పోలీసు వారు రెట్టించిన ఉత్సాహంతో, పాత కార్యకర్తలను సమన్వయించుకొంటూ, ఆ చీకట్లోనే- చిల్లల వాగు  లోతైన ఒడ్డు నున్న కాంక్రీటు స్తంభాలను, పెద్ద రాళ్లను అవలీలగా మోసి, పడిపోయిన వంతెన గోడ స్థానంలో పేర్చి, పాదచారుల- వాహన చోదకుల భద్రతకు భరోసా ఇచ్చి, “ రక్షక భటులు” అనే తమ పేరును సార్ధకం చేశారు. వంతెన మీది మట్టిని దారి ప్రక్క గుంటల్లో సర్దారు.

అమర పోలీసుల సంస్మరణ వారోత్సవాన్ని ఈ విధంగా స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో పాల్గొనడంతో మొదలెట్టడం సముచితంగా ఉన్నది.

కొత్త ద్వి చక్ర వాహనాన్ని కొన్న సందర్భంలో నాయుడు మోహన రావు, కొద్ది రోజులు ఈ సుప్రభాత గ్రామ సేవలకు దూరమౌతున్న వ్యధతో కొర్రపాటి వీర సింహుడు అందరికీ మిఠాయిలు పంచి, అందులో రెండవ వారు స్వచ్చోద్యమానికి 500/- ధన సహాయం చేసినందుకు ఉభయులకు ధన్యవాదాలు.

 చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చల్లపల్లి సుదీర్ఘ స్వచ్చోద్యమ ప్రత్యేకతనూ, ఆ ఉద్యమ ప్రారంభకులు డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారి గాంధీ గారి అంశనూ ప్రస్తావించి, ముమ్మారు గంభీరంగా ఎలుగెత్తి చాటిన స్వచ్ఛ గ్రామ సంకల్ప నినాదాలను పునరుద్ఘోషించిన కార్యకర్తలు 6.35 నిముషాలకు నేటి తమ కర్తవ్య దీక్షను విరమించారు.

   రేపటి 1800 రోజుల స్వచ్చోద్యమ అతిథి రమేష్(కార్డియాలజిస్టు) గారినీ, వారి శ్రీమతిని స్వాగతించి, శ్మశాన స్వచ్ఛ సుందరీకరణ కోసం ఉదయం 4.00 కు కలుసుకొందాం.

           వర్తమాన నిరూపితం.

పద్దెనిమిది వందల పని దినాలన్న మాటలా?

లక్షా ఎనభై వేల శ్రమ గంటలసలు సాధ్యమా?

కళ్లెదుటే-వర్తమాన కాల మందె నిరూపితం

చల్లపల్లి స్వచ్ఛ సైన్య సాహసమిది అద్భుతం!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 15/10/2019

చల్లపల్లి.

14.05 కు కాటా వద్ద3 4 5 10 9 8 7 612 14

17 19 20 21 23 24 25

27 30 33 3528 34 35 36 39 40 42 43 44 45 47 49 50 56 58 59 62 63 64 67 69 71 76

65 74 7754పచ్చని చెట్లతో అందమగా కనిపిస్తున్న విజయవాడ రోడ్డు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *