స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1800* వ నాటి అనుభవాలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1800* వ నాటి అనుభవాలు.

స్వచ్చోద్యమంలో ఒక మైలు రాయి ఐన ఈ నాటి వేకువ 4.05-6.05 నిముషాల మధ్య అసలే అందంగా ఉన్న శ్మశాన పరిసరాలను మరింత స్వచ్చ శుభ్రంగా తీర్చిదిద్దుతూ 51 మంది శ్రమించారు.

“ఇంత సుందరమైన కర్మల భవన- దహన వాటిక-రుద్ర భూముల దగ్గర, ఒద్దికగా పెరుగుతున్న చెట్ల పచ్చదనాల- పూల సోయగాల మధ్య ఇంకా ఏం శుభ్రపరచాలి, మరెంత అందగించాలి”? అని కొత్త వారికి సందేహం కలగవచ్చు. నాలుగేళ్ల నాటి ఈ ప్రాంతపు దుర్గంధ- దుర్మార్గ-భీభత్స విశ్వరూపం గుర్తున్న వారికి వందల కొద్దీ స్వచ్ఛ కార్యకర్తల వేలాది పని గంటల శ్రమతో మాత్రమే ఈ స్వచ్ఛ- శుభ్ర-సౌందర్య సాక్షాత్కారం జరిగిందని గుర్తుకు రావాలి. ఈ స్వచ్చ సైనికుల శుభ్ర-శౌచ-సౌందర్య కాంక్షకు హద్దులు లేవు!

నేటి స్వచ్చంద శ్రమ దానంలో లయన్స్, నడక సంఘం, ధ్యాన మండలి తదితరుల ప్రమేయం ఉంది. ‘మనకోసం మనం’ ట్రస్టు ఉద్యోగుల పాత్ర ఉంది. సిమెంటు రోడ్డు బారునా బురద తుడిచి, ఎండు మట్టిని గోకి, ఊడ్చి, కలుపు మందుతో ఎండిన గడ్డిని పీకి, సహజ ఎరువు తయారీ కేంద్రాన్ని శుభ్రపరచిన, కార్యకర్తలు కాఫీ సేవానంతర సమావేశంలో కాస్త వినోదించి, విశ్రమించారు.

స్వచ్చోద్యమ చల్లపల్లిని చిరకాలంగా అభిమానించిన విజయవాడకు చెందిన హృద్రోగ నిపుణుడు, డాక్టర్ పోతినేని రమేష్ గారు, వారి శ్రీమతి మహాలక్ష్మి గారు పెందలకడే శ్మశానానికి వచ్చి, ప్రత్యక్షంగా స్వచ్ఛ సైనికుల నిస్వార్థ సుదీర్ఘ కృషిని గమనించి, 2 ½ గంటలకు పైగా వారితో గడిపారు. ఈ నిర్విరామ స్వచ్చోద్యమం ఆవశ్యకతను, ఆ ఉద్యమ కారులను ఆ దంపతులిద్దరూ అభినందించారు.

స్వచ్ఛ చల్లపల్లి సంస్థాన గాయకుడు నందేటి శ్రీనివాస్ తన పాటలతో, పద్యాలతో అతిధులను, కార్యకర్తలను ఉర్రూతలూగించి, చప్పట్లు కొట్టించి, తన ఉద్యమ నిభద్దతను చాటుకొన్నాడు. అతడు పదే పదే స్వచ్చ సుందర చల్లపల్లి సంకల్ప నినాదాలను ధ్వనించి, అందరిచే ప్రతి ధ్వనింప చేసి, 7.00 కు నేటి స్వచ్ఛ సుందర కృషికి ముగింపు పలికాడు.

అతిథులిద్దరూ చెరొక మొక్కను నాటి, గ్రామ విశేషాల సందర్శనకు పూనుకొన్నారు.

స్వచ్ఛ కార్యకర్త కంఠమనేని రామ బ్రహ్మం గారు స్వచ్చోద్యమం కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు 15,000/- చెక్కును మరియు కార్యకర్తలకు అల్పాహార విందుకు 3000/- రూపాయలను అందించారు. వీరికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు. ట్రస్టుకు ఇప్పటికి వీరు ఇచ్చిన మొత్తం1,70,000/-రూపాయలు.

రేపటి మన స్వచ్ఛ సుందర సంకల్ప సాధనకై చిల్లల వాగు వంతెన దగ్గర కలుసుకొందాం!

 ప్రకటించాలని ఉన్నది.

గజాలుగా కొలువ గలుగు గ్రామ సేవలివి కావని….

అధికారం-ధన బలంతొ అమలు జరుగు పని కాదని..

హృదంత రాళముల నుండి ఉప్పొంగే స్ఫూర్తి తోనె

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతోంది చూడండని….

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 16/10/2019

చల్లపల్లి.

14.07 కు  స్మశానంలో2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 26 29 3024 2526 31 60 61 74 75 7633 34Dr.Ramesh గారి ప్రసంగం62డా.రమేష్ గారి సతీమణి స్పందన728736 39 41 43 45డా.రమేష్ దంపతులు మొక్కలు నాటారు74 75 76 889015,000/- రూపాయల చెక్కును అందిస్తున్న కంఠమనేని రామబ్రహ్మం గారు56 55 47 58 83 59 53

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *