స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1801* వ నాటి వర్షానందం.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1801* వ నాటి వర్షానందం.

 ఈ వేకువ 4.10-6.10 నిముషాల నడుమ చిల్లల వాగు వంతెన నుండి వక్కలగడ్డ దిశగా సాగిన ఉభయ గ్రామాల పరిధి లోని శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యదీక్షాపరులు 26 మంది.

 5.20 నుండి జోరు వాన తన తడాఖా చూపిస్తుండగా- దారి కిరుప్రక్కల- చెట్ల మధ్య ఖాళీ జాగాలలో పాదులు తీసి మూడు రంగుల “ గద్ద గోరు” నామాంతరం గల 40 అడవి తంగేడు మొక్కలు నాటి, వర్షం మీద పై చేయి సాధించిన స్వచ్చ సుందర దీక్షా దక్షులను నేను గుర్తించి హర్షిస్తాను గాని ఈ రెండు గ్రామాల-30 వేల మందిలో వారి శ్రమకు ఖరీదు కట్టే షరాబు లెందరు?

మళ్లీ మళ్లీ వస్తున్న వానను ధిక్కరిస్తూ కొందరు కార్యకర్తలు చిల్లల వాగు ఉత్తరపు గట్టును కూడ కొంత మేర బాగు చేసి, మొక్కలు నాటారు. ఈ శ్రమ జీవన సౌందర్య కారుల కృషి ఫలించి, ఆ పూల మొక్కలీ దారి కెన్ని సొగసులద్దుతాయో రాబోయే రోజుల్లో చూసి ఆనందిద్దాం.

  నిన్నటి 1800* దినాల సేవల వేడుక సందర్భంగా  కేకు ముక్కలను, కాఫీని వానలోనే సేవించిన స్వచ్చ సైనికులు వాన కన్న మిన్నగా డాక్టర్ పద్మావతి గారు ముమ్మారు నినదించిన స్వచ్చ సుందర సంకల్పాన్ని పునరుద్ఘాటించి, 6.30 నిముషాలకు నేటి బాధ్యతలు విరమించి, గృహోన్ముఖులయ్యారు.

 రేపటి మన గ్రామ కర్తవ్యాన్ని గంగులవారిపాలెం దారిలో కొనసాగిద్దాం.

ఘంటసాలకు చెందిన ( అమెరికా) ప్రవాస భారతీయురాలు- వేమూరి ఇందిర గారు చల్లపల్లి లో ఇటీవల పర్యటించి, ఆ స్వచ్చ-శుభ్ర-సౌందర్యాలను సహర్షంగా తిలకించి, శివబాబు గారి ద్వారా “ మనకోసం మనం” ట్రస్టుకు 2000/- విరాళమందజేశారు. ఈ అజ్ఞాత స్వచ్చ సుందర చల్లపల్లి శ్రేయోభిలాషికి కార్యకర్తల కృతజ్ఞతాభివందనాలు.

వినయ వినమిత….

ఒక విశాల ప్రయోజనముకై-ఒక సమున్నత విలువ కోసం

అష్టాదశ శత దినాలుగ ఈ స్వచ్చ సైన్యం నిత్య సమరం

విదిత స్పష్ట ప్రణాళికతో-వినయ వినమిత మస్తకంతో

జనం మధ్యన- జనం కొరకే సాగుచున్న సుదీర్ఘ  పయనం!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 17/10/2019

చల్లపల్లి.

14.10 కు చిల్లల వాగు వద్ద2 3 4 5

మొక్కలు నాటుతున్నారు6 7 9 10 11 12 13 15 1621 22 26 27 28 29 39 42 48 50 5418 23 24ఈరోజు నాటిన మొక్కలు31 40 33 38 32

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *