స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1802* వ నాటి స్వచ్చంద కృషి

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1802* వ నాటి స్వచ్చంద కృషి

          ఈ ఉదయం 4.03-6.05 నిముషాల నడుమ గంగులవారి పాలెం మలుపులో జరిగిన శ్రమదానం లో 33 మంది పాల్గొన్నారు. కేవలం రెండు నెలల క్రితం కార్యకర్తలు శ్రమించి, రకరకాలు పూల మొక్కలు పెట్టినా – అందులో కొన్ని  బ్రతకక – వర్షాలకు మళ్ళీ గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో ఈ దారిలోనే నేటి కృషి అవసరమైనది.

నలుగురు స్థానికులు కూడ పాల్గొన్న ఈ గ్రామ శుభ్ర సుందరీకరణంలో – ఎక్కువమంది గడ్డిని, పిచ్చి – ముళ్లమొక్కల్ని పీకి నరకడంలోనే శ్రమించారు. కొందరా గడ్డిని, మొక్కల్ని బండ్రేవుకోడు ఉత్తరం గట్టుకు దన్నుగా పేర్చారు.

రోడ్డుమీది, ప్రక్కల దుమ్మును, వ్యర్ధాలను గొర్రులతో, చీపుళ్లతో కొందరు శుభ్రం చేశారు. ఈరోజు గూడ ఈ స్వచ్చ కార్మికులను వర్షం రెండు సార్లు పలకరించిపోయింది.

ఒకటి రెండు రోజుల్లో వంతెన దాక ఈ మార్గాన్ని శుభ్రం చేశాక మరికొన్ని పూలమొక్కలు ఇక్కడ నాటవలసి ఉంది.

  1802 రోజులుగా గ్రామ సౌకర్యాల కోసం తాము స్వచ్చ-శుభ్ర- సుందరీకరణలు చేస్తుంటే – ఆ డ్రైన్లను, జాగాలను కొందరు ఆక్రమిస్తూ – దారుల ప్రక్కనే చేపల దుకాణాలు నడుపుతుంటే – ప్లాస్టిక్ వాడకం తామనుకొన్నంత తగ్గకుంటే – మనస్తాపం చెందిన కార్యకర్తలు చల్లపల్లి గ్రామ సంక్షేమం దృష్ట్యా – ఏడెనిమిది అంశాల పరిష్కారం కోసం తహసీల్ గారి కొక విజ్ఞాపన పత్రం వ్రాసి, సంతకాలు పెట్టి ఈ రోజు వారికందజేస్తున్నారు.

గౌరిశెట్టి నరసింహారావు గారు కొంచెం కసితో ముమ్మారు ప్రకటించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను కార్యకర్తలంతా గట్టిగా సమర్ధించి 6.35 నిముషాలకు నేటి తమ గ్రామ బాధ్యతలను ముగించారు.

      26 వ తేదీ – శనివారం రాజమండ్రి లో ఒక అవార్డు స్వీకరణకై కార్యకర్తలు వెళ్ళి రావాలని కూడ నిర్ణయించారు.

రేపటి మన స్వచ్చంద శ్రమదానం గంగులవారిపాలెం మార్గంలోనే నిర్వహిద్దాం.

    …. అసలు మూల సూత్రం.

ఎవరు వల్లె వేయ లేరు ఈ రోజుల్లో కబుర్లు?

ఆచరణలో ఆదర్శమె అవహేళన పాలు!

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతి మాత్రమె భిన్నం

చెప్పినదే – చేసినదే చెప్పు మూలసూత్రం!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 18/10/2019

చల్లపల్లి.

1 4.03 కు గంగులవారిపాలెం రోడ్డులో2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 Greenary

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *