స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1804* వ వర్ష కేళి V స్వచ్ఛ సేవలు.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1804* వర్ష కేళి V స్వచ్ఛ సేవలు.

ఈ వేకువ కూడ కార్యకర్తలతో బాటే మేల్కొన్న వర్షం వారికి తోడు-నీడగా నిలవడంతో 27 మంది శ్రమదానం సగ భాగమే జరిగింది.

వాన మరీ పెద్దదైనప్పుడు చేతుల్లో కత్తులు జారిపోతున్నా కొందరు వాన మీద పంతం పట్టినట్లు పని చేస్తూనే ఉన్నారు. కొందరు దారి ప్రక్క ఇళ్ల సన్ షెడ్ల నాశ్రయించినారు. హనుమకొండ దుర్గా ప్రసాదు గారి ఇంటి హాలు కొద్ది మంది కాశ్రయమిచ్చింది.

సుందరీకరణ బృందం మాత్రం అరగంటకు పైగా మా ఇంటి వెలుపలి రహదారి తోటలో తామే మొలిపించి, పెంచిన వందకు కు పైగా బంతి మొక్కల్ని ఆ వానలోనే నాటారు.

ముగ్గురు మొండి కార్యకర్తలైతే- కాలుష్యం మీద కసితో జోరు వాన ను లెక్క చేయక- విద్యుత్ కార్మికులు క్రూరంగా నరికేసిన- డ్రైను కడ్డంగా పడి ఎండిన చెట్లను డ్రైను లోకి దిగి, కొమ్మలు నరికి బైటకు లాగి వేశారు.

నిన్నటి- ఈనాటి రోడ్ల మీది వ్యర్ధాలను ట్రాక్టర్ లోకెక్కించి, నలుగురు శ్రమించారు. ఏమైనా- ఈనాటి శ్రమదానం 50% మాత్రమే జరిగి ఉంటుంది. ఐతే-వాన హెచ్చిన తమ ఖాళీ సమయాల్లో స్వచ్చ సైనికులు వినేదీ-ఆలోచించేదీ-చర్చించేదీ నిరర్ధక లోకాభిరామాయణం కాదు; స్వచ్ఛ సుందర స్వగ్రామం గురించే!

బాల కార్యకర్త దేసు జాహ్నవి ధృఢంగా చెప్పిన త్రిగుణాత్మక స్వచ్ఛ సుందర సంకల్పాన్ని కార్యకర్తలంతా ఏక కంఠంగా అంగీకరించి, 6.25 నిముషాలకు ఈనాటి తమ మాతృ గ్రామ బాధ్యతను ముగించారు.

రేపు సోమవారం ప్రధాన వీధుల పారిశుధ్యం నిర్వహించే మన సంప్రదాయానుసారం పోలీస్ స్టేషన్ వీధి దగ్గర కలుసుకొందాం! ఇటీవల అనారోగ్యంతో పొరాడి గెలిచిన మన సీనియర్ కార్యకర్తలైన శివరామ కృష్ణయ్య దంపతుల మూడు నెలల విరాళం- 3000/- ను తమ కుమారుని సహాయంతో వచ్చి స్వయంగా డాక్టర్ డి. ఆర్. కె. ప్రసాదు గారి కందించినందుకు స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.

ఒక సామూహిక పరివర్తన

ఉపన్యాస ఉద్ఘోషలు ఊళ్లో ప్రవహించిననూ-

కవితలెన్ని వ్రాసిననూ- గానం ప్రసరించిననూ-

రావలసింది ఆదరణ-కావలసింది క్రియాచరణ

చల్లపల్లి లో సమూల సామూహిక పరివర్తన!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 20/10/2019

చల్లపల్లి.

14.05 కు పద్మాభిరామంలో2 3 4 5 6 7 8 9 10 బైపాస్ రోడ్డులో చెత్త ఎత్తుతున్నారు11 12 13 14 15 16 లోడు చేసిన చెత్త17 18 చెత్త తీసేసాక1930 34రావెళ్ల శివరామ కృష్ణయ్య గారి విరాళం25 29 33 3824

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *