స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1805* వ నాటి సమాచారం.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1805*నాటి సమాచారం.

          ఈ వేకువ 4:05 – 6:05 నిముషాల నడుమ సమయంలో – స్వచ్ఛ చల్లపల్లి నియమాన్ని కొంచెం సవరించి – ప్రథాన కూడలి, వీధులకు బదులు పోలీస్ స్టేషన్ బజార్ లో బందరు మార్గం నుండి పొట్టి శ్రీరాములు వీధి వరకు జరిగిన స్వచ్చందశ్రమదానంలో 38 మంది తమ గ్రామ బాధ్యతను నెర వేర్చారు.

          బందరు రహదారి నుండి రథం సెంటరు దాకా పోలీస్ స్టేషన్ మార్గాన్ని, ఇరుప్రక్కలను చీపుళ్లతో ఊడ్చి, కాగితాలను, కవర్లను చేతులతో ఏరి, ట్రాక్టర్లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు. M.V.  ట్రేడర్స్ సమీపంలో మాత్రం ఈ గలీజు, దుమ్ము చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.  పోలీస్ స్టేషన్ లో కూడ తగు మాత్రంగా ఉన్నది.

          ఆసమయానికి స్టేషన్ లో ఉన్న ఏడుగురు రక్షకభటులు కూడ స్వచ్ఛ కార్యకర్తలతో చేతులు కలిపి, అందరూ ఆ వాన సాక్షిగా పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేశారు. కార్యకర్తలు తమ శ్రమదానం ముగించి, ఇళ్లకుచేరుకునే దాక వాన వాళ్ళతో కలిసి మెలిసి ఉంటున్నది.

           కోడూరు వేంకటేశ్వర రావు గారు మూడు మార్లు ఎలుగెతి చాటిన స్వచ్ఛ సంకల్ప నినాదాలను పునరుద్ఘాటించిన కార్యకర్తలు 6:30 కి తమ కర్తవ్యాన్ని విరమించారు.

         రేపటి మన స్వచ్ఛ పతాకాన్ని గంగులపాలెం మార్గంలో ఎగరేద్దాం.

         స్వస్తత పెంపొందే పని

గ్రామానికి రోజూ గంట శ్రమచేస్తే తప్పేమిటి?

ఉదయానె సమిష్టి మేలు కుద్యమిస్తే ముప్పేమిటి?

స్వచ్ఛ భావనతో- శ్రమతొ స్వస్తత పెంపొందదా?

స్వచ్చోద్యమ భవితవ్యం సవ్యంగా సాగదా?    

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 21/10/2019

చల్లపల్లి.

14.05 కు పోలీసు స్టేషన్ బజారులో2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

20పోలీస్ స్టేషన్ మూల గ్రామస్తులు చెత్తను పడవేస్తున్నారు  22 23 25 26 27 28

29 30 32 34 35 36 37 38 40 41 42 43 44 47 48 49 51 52 54 56 57 58 59 60 61 62 64 65

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *