స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1806* వ నాటి వర్ష హేల.

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1806*నాటి వర్ష హేల.

నేటి వేకువ 4.00-6.00 మధ్య గల గంగులవారిపాలెం మురుగు కాల్వ వంతెన సమీపం లో జరిగిన స్వచ్చంద శ్రమదానం లో 30 మంది భాగస్వాములయ్యారు.

          తెరలు తెరలు గా- పల్చగా కురుస్తున్న వాన 5.00 తరువాత ఆగిపోయి, చకచకా 45 నిముషాల పాటు నిరాఘాటంగా స్వచ్ఛతా చర్యలు జరిగాయి. కాలువ గట్టు, పొలం గట్టు కు దారికి ఉత్తర దిశ జాగాలలోని గడ్డిని, పనికి మాలిన మొక్కల్ని, ముళ్ల మొక్కల్ని తొలగించి, మద్యం సీసాలను పోగు చేసి, ట్రాక్టర్ లో నింపి, మైకులో విన్పిస్తున్న శ్రీనివాస్ స్వచ్ఛ సందేశాత్మక పాటలు వింటున్న శ్రమ సుందర దృశ్యాన్ని, స్వచ్ఛ శ్రామికులను 5 నిముషాల్లోనే క్రమ్ము కొచ్చిన భారీ వర్షం అక్షరాలా ముంచేసింది.

  రోజుటి కన్న 5 నిముషాల ముందే తమ గ్రామ కర్తవ్యం ముగించిన 30 మంది స్వచ్ఛ సైనికులు పద్మాభిరామం లోని కి ప్రవేశించముందే తడిసి ముద్దై పోయారు.(ఇలా వానలకు తడిసిన పిదప చలి గాలులకు, మంచులకు, ఎండలకు వీళ్లీ ఐదేళ్లలో ఎన్నడూ ఈ స్వచ్చోద్యమాన్ని ఆపలేదు!)

    సుందరీకరణ బృందం పనులు నేడు కూడ సాగలేదు. పులిగడ్డ పాఠశాలలోపాధ్యాయుడు అడపా గురవయ్య కొన్ని జీవిత సత్యాలను వివరించి, గట్టిగా ముమ్మారు చెలరేగిన గ్రామ స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను దీటుగా పునరుద్ఘాటించిన కార్యకర్తలు 6.15 నిముషాలకు నేటి తమ ఊరి బాధ్యతా నిర్వహణకు స్వస్తి పలికారు.

   సామాజిక సత్సంబంధాల స్థాయిని బట్టి మనుషుల జీవన ప్రమాణం ఉంటుందని డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు విశ్లేషించారు.

రేపటి మన గ్రామ కర్తవ్యాల కోసం పద్మాభిరామం(గంగులపాలెం దారి) వద్ద కలుసుకొని నిర్ణయించుకొందాం!

                 స్వచ్ఛ సైన్యం విశ్వరూపం

ఎండ కెండని- వాన తడపని-మంచు కాగని ఉద్యమం ఇది

సదవగాహన- తత్వ చింతన-సమయ పాలన కలిగినట్టిది

గ్రామ పౌర సమాజ బాధ్యత కలలు గంటూ-నిజం చేస్తూ

అష్టాదశ శత దినాలుగ తన విశ్వ రూపం చూపుతున్నది!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 22/10/2019

చల్లపల్లి.

14 గంటలకు పద్మాభిరామమ్ వద్ద2గంగులవారిపాలెమ్ రోడ్డులో3 4 5 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 22 24 25 26

36 37

32 38 40 43

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *