స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1807* వ నాటి ముసురు చలి గాలిలోన;

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1807* వ నాటి ముసురు చలి గాలిలోన;

పగబట్టిన-వేధించిన ముసురులో ఈ వేకువ 4.00-6.00 మధ్య పట్టుబట్టి నిర్వహించిన స్వచ్ఛ గ్రామ ప్రయత్నంలో పాల్గొన్న కార్యకర్తలు 12 మందే.

ఐతే ఈ 12 మందీ 30 మందితో సమానంగా వాన లో- ఈదురు గాలిలో వెనకడుగు వేయక తమ గ్రామ బాధ్యతా నిర్వహణ లో అనుకున్నది సాధించారు.

(నేను 50 ఏళ్ల క్రిందట చూసిన “ది డర్టీడజన్” అనే హాలీవుడ్ సినిమా లో హీరో లు తమ దేశాన్ని రక్షించినట్లు-) ఈ కొద్ది మంది కార్యకర్తలే-

తొలుత నాగాయలంక దారి జలమయమైపోతున్న కారణం వెదికి, పెట్రోలు బంకు దగ్గర డ్రైను పారక పోవడాన్ని గమనించి, అందులోని ఖాళీ మద్యం, ప్లాస్టిక్ సీసాలను, ఆకుల్నీ, సంచుల్నీ, చెత్తనూ బైటకు లాగితే గాని ఆ మురుగు కాల్వ రోడ్ల మీది నీటిని లాగేయలేదు.(వాట్సాప్ లో ఫోటోలను గమనించండి.) మురుగు కాల్వ మీది బరువైన పై కప్పు పలకలను తొలగించండం, పని పూర్తయ్యాక మళ్లీ భద్రంగా అమర్చడం-ఇదే నేటి స్వచ్ఛ సైన్య తొలి విజయం.

తరువాత 4.50 కి బయలుదేరిన వీళ్లు పాగోలు రోడ్డుకు చేరుకుని, దాని రెండు ప్రక్కల పాదులు చేసి, అడవి తంగేడు అనబడే గద్ద గోరు పూల మొక్కల్ని 48 నాటి, అంతకు ముందే తమ కృషితో సుందరమైన ఆ దారిని మరింత సుందరతరం చేశారు.

వర్షంతో నిర్మానుష్యమైన పాగోలు మార్గంలో ఆ వర్షాన్ని, అందులోనే స్వార్ధ రహితమైన వీరి సేవల సందడిని ఆస్వాదించడం నా వంటి వాళ్లకు గొప్ప అనుభూతి.

పాగోలు నడి రోడ్డు మీద జరిగిన స్వచ్ఛ కార్యకర్తల సమావేశంలో శివబాబు సాధికారికంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్ఛ -శుభ్ర చల్లపల్లి సంకల్ప నినాదాలను మిగిలిన వారు గట్టిగా సమర్ధించి, 6.20 నిముషాలకు తమ సంతృప్తి కర గ్రామ బాధ్యతలకు స్వస్తి పలికారు.

  మిగిలిన పూల మొక్కలు పాగోలు, నాగాయలంక దారుల్లో నాటేందుకు రేపు కూడ ముందుగా కరీముల్లా డ్రస్సెస్ వద్ద కలుసుకొందాం!

D.R.K. విశ్లేషణ

సామాజిక బంధాలను సవ్యంగా నడిపిస్తే-

నిస్వార్ధ సమాజ సేవ నిత్యం నిండుగ చేస్తే-

అర దశాబ్ది గ్రామ బాధ్యతంతా నెరవేరిస్తే-

ఆయుష్యం-మనో బలం అమాంతంగ పెరిగేనని….

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 23/10/2019

చల్లపల్లి.

 

1కరీముల్లా dresses వద్దకు బయలుదేరుతున్నాము .7 9మందు సీసాలు, ప్లాస్టిక్ బాటిల్స్ తో నిండిపోయిన డ్రైను2 Petrol bunk. వద్ద డ్రైన్ శుభ్రత3 6 10 12 13 17 19 20 డ్రైను లో ఉన్న చెత్తను బైటకు తీస్తున్న కార్యకర్తలు21 2324 26

పాగోలు రోడ్డులో మొక్కలు నాటుతున్నారు27

42 44 46 4929 30 31 3236ఒకప్పుడు ఈ రోడ్డు బహిరంగ మల విసర్జనతో చాలా అద్వానంగా ఉండేది.4140గంగులవారిపాలెం రోడ్డు మొదట్లో  డ్రైను లో ఉన్న చెత్తను తీస్తున్న ట్రస్టు కార్మికుడు3834 37

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *