స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1808* వ నాటి స్వచ్ఛ వినోదం (24.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం  1808* వ నాటి స్వచ్ఛ వినోదం.

           నేటి వేకువ 4.03-6.05 నిముషాల నడుమ నాగాయలంక మార్గం-ధాన్యం మిల్లు ప్రాంతంలో నెలకొన్న గ్రామ స్వచ్ఛ -శుభ్ర-సుందరీకరణలో 28 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

            స్వచ్ఛ బాధ్యతల నిర్వహణను గత 10 రోజులుగా వెంటాడుతున్న వర్షం ఈ ఒక్క రోజు ఈ గ్రామాన్ని మినహాయించింది. స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ల దగ్గర సుందరీకరణ బృందం శ్రమ నిరాటంకంగా-సాఫీగా సాగిపోయింది.

            మిగిలిన కార్యకర్తలు బండ్రేవు కోడు వంతెన దగ్గర వానకు కొట్టుకుపోయిన మట్టిని మరలా నింపి రోడ్డు భద్రతకు కృషి చేసినా- ఈ రోజు ప్రధానంగా చేసింది మాత్రం నాగాయలంక మార్గానికిరువైపుల-ముఖ్యంగా అడపా నాంచారమ్మ రహదారి వనం పొడుగునా గడ్డి-పిచ్చి మొక్కలను తొలగించడం, పాత మొక్కల్ని సరిదిద్దడం, క్రొత్తగా 100 కి పైగా అడవి తంగేడు(గద్ద గోరు)పూల మొక్కలు పాదులు తీసి నాటడమే. ఈ కృషి సుబ్బ నాగన్న ఆశ్రమం దాకా విస్తరించింది.

            రోడ్డు, దాని ప్రక్కల ఊడ్చి పోగులు పెట్టిన వ్యర్ధాలను మన కోసం మనం ట్రస్టు ఉద్యోగులు తొలగిస్తారనుకొంటా.

            నేటి కాఫీ సేవానంతర సమావేశంలో 26 వ తేదీ రాజ మహేంద్ర వర ప్రయాణ సన్నద్ధతను చర్చించారు. స్వల్ప అనారోగ్య కారణంగా కొన్ని రోజుల నుండి మన ఉషోదయ బాధ్యతలకు దూరమైన పాగోలు నివాసి కంఠంనేని రామ బ్రహ్మం గారు ఈ ఎడబాటును, కారణాలను వివరించి, 1808 రోజుల అసాధారణ స్వచ్చోద్యమానికి పాదాభివందనాలర్పించి, ఎలుగెత్తి ముమ్మార్లు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ-శుభ్ర-సుందరీకరణ సంకల్ప నినాదాలను కార్యకర్తలు కూడా అందుకొని, 6.30 నిముషాలకు తమ ప్రస్తుత దిన బాధ్యతలను ముగించారు.

             పరిమిత ఆదాయ వనరులు, చెప్పుకోదగని ఆస్తులు ఉన్న ఈ వ్యక్తి పెద్ద వయసులో కూడ ఉభయ గ్రామాలలో స్వచ్చంద శ్రమదానంతో బాటు “ మనకోసం మనం” ట్రస్టుకు చీటికి మాటికి లక్షల్లో చేసిన-చేస్తున్న అర్ధ దానాల గురించి దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు వివరించారు. అదే విషయం మీద స్వచ్ఛ కార్యకర్తల తరపున నేను వ్రాసి, చదివిన పద్యాలను కరతాళాలతో అందరూ హర్షించారు.

        వర్షం వచ్చినా సరే-రేపటి మన గ్రామ బాధ్యతల కోసం నాగాయలంక దారిలోని సుబ్బనాగన్న సత్రం వద్ద కలుసుకుందాం.

             రామబ్రహ్మం చేతులు.

శ్మశానాలు రహదార్లకు స్వచ్ఛత నేర్పిన చేతులు

మురుగు కాల్వ తుక్కు తీసి మురిసినవాతనిచేతలు

దారులు ఊడ్చిన చేతులు-దానం చేసిన చేతులు

ప్రజా సేవ మార్గం మందె రామబ్రహ్మం అడుగులు!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

గురువారం – 24/10/2019

చల్లపల్లి.

14.03 కు నాగాయలంక రోడ్డులో రైస్ మిల్లు వద్ద2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *