విరబూసిన ఏడాకుల పూల మొక్కల తో ఊరంతా సుందరంగా ఉన్న చల్లపల్లి

WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (4)

        1995 లో దాసరి రామ మోహన రావు గారు, స్వర్ణలత గారు వరంగల్ లో ఒక పార్కులో అందంగా ఉన్న ‘ఏడాకులపాల’మొక్కలను చూసి ముచ్చట పడి రెండు మొక్కలను తెచ్చిగంగులవారి పాలెం రోడ్డు లోని పద్మావతి ఆసుపత్రి ముందు నాటడం జరిగింది. అవి పెరిగి అందంగా తయారై చూపరులను ఆకట్టుకొన్నాయి.

DSC_0870దాసరి రామ మోహన రావు గారు, స్వర్ణలత గారు

 ఈ మొక్క బొటానికల్ నేమ్ ‘Alstonia scholaris’. 1811 లో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఎడిన్ బరోకు చెందిన ‘Charles Alston’ (1685-1760) అనే వృక్ష శాస్త్ర ఆచార్యుని గుర్తుగా ఈ పేరు పెట్టడం జరిగింది.

 సంవత్సరంలో ఒక్కసారి మొక్క నిండా పూలు వస్తాయి. ఆ తరువాత కాయలు వచ్చి అవి పగిలి బూరగ దూది విత్తనాల వలె గాలిలో ఎగురుతూ నేల మీద పడి మళ్లీ కొత్త మొక్కలు వస్తుండేవి. వీటన్నిటినీ రామ మోహన రావు గారు పాకెట్లలో పెట్టి పెంచి అడిగిన వారందరికీ ఇస్తుండేవారు. పాపవినాశనానికి చెందిన కొల్లి బుచ్చి కోటేశ్వర రావు గారు చాలా మొక్కలను తీసుకొని తమ గ్రామంలో నాటి పెంచారు.

8989వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు

ఆ తరువాత వాసిరెడ్డి కోటేశ్వర రావు మాష్టారు 6 వ నంబర్ కాలువ నుండి బస్టాండ్ వరకు 116 మొక్కలను నాటి, రక్షించి, పోషించారు. స్వచ్చ కార్యకర్తలు గంగులవారిపాలెం రోడ్డు లో అధిక సంఖ్యలో ఈ మొక్కలను  నాటగా వక్కలగడ్డకు చెందిన ప్రభాకర రావు మాష్టారు నీళ్లు దొరకని మండు వేసవిలో తమ విద్యార్ధులతో ఒక నెల రోజులు పాటు నీరు పోయించి రక్షించారు. స్వచ్చ కార్యకర్తలు ఈ మొక్కలు అన్నింటికీ కంప కట్టి చక్కగా పెంచారు.

12736c20-72b6-4328-84c6-f03a2085601fకొక్కిలిగడ్డ మణి ప్రభాకర రావు మాష్టారు

          పూలు పూసినప్పుడు మొక్క చాలా అందంగా ఉంటుంది. క్రింద రాలి పడిన పూలతో ఉదయం పూట ఆ ప్రాంతం చూడ ముచ్చటగా ఉంటుంది. ఆ పూలలో ఉన్న మకరందం కోసం కొన్ని వందల సీతాకోకచిలుకలు వస్తాయి. ఆ దృశ్యం చూడటానికి కన్నుల పండుగగా ఉండడంతో, సౌందర్యప్రియులు ఈ రోడ్డులోకి వచ్చి పదే పదే ఈ దృశ్యాన్ని చూసి వెళ్తుంటారు. కాని, సాయంత్రాలు వచ్చే ఈ పూల వాసన మాత్రం కాస్త ఘాటుగా ఉంటుంది. 
 

          ఈ పూల వల్ల ఎలర్జీలు వస్తాయని కొన్ని నగరాలలో ఈ మొక్కలను కొట్టివేయాలనే ఆలోచన ఉన్నట్టుగా నాలుగు ఏళ్ల క్రితం పత్రికలలో వార్తవచ్చింది. నేను వెంటనే జిల్లా అటవి శాఖ అధికారిని కలిసి చర్చించాను. అది వట్టి అపోహే అని ఆయన తేల్చేశారు. అంతేకాకుండా నీడకు, అందానికి, రోడ్డు పక్కన పెట్టడానికి ఇది మంచి మొక్క అని చెప్పారు. ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలకు వివరించాం కూడా.

  

సీన్ కట్ చేస్తే…………………

 

          ఇప్పుడు ఆ ‘ఏడాకులపాల’ మొక్కలన్నీ విరగబూసి, చల్లపల్లిని మరింత స్వచ్చ సుందరంగా- పాదచారుల చూపులను కట్టి పడేస్తున్నాయి.ఈ వందలాది మొక్కలను ట్రిమ్ చేస్తూ రెండేళ్ల పాటు శ్రమించిన స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు, దాసరి రామ మోహన రావు దంపతులుఈ గ్రామ శ్రమ జీవన సౌందర్య కర్తలు.ఆ ఉభయులకూ అభినందనలు.

 

దాసరి రామకృష్ణ ప్రసాదు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

చల్లపల్లి – 25.10.2019.

37 WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (5) WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM 1c4f3c88-84fe-4a0b-8487-fd35ffa2a998 d05a5b7f-abbe-42f7-a1c9-65df60f3300fWhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (1) WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (2) WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (3) WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (9)

 WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (11) WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (12) WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *