స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810* వ నాటి స్వచ్ఛ కృషి (26.10.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810* వ నాటి స్వచ్ఛ కృషి.

          ఈ ప్రభాత వేళ 4.00 – 5.45 నిముషాల నడుమ – వాన లేని వేకువలో గ్రామ సేవలో పాల్గొన్న ధన్యులు 24 మంది. కార్యరంగం నాగాయలంక మార్గంలో 7 వ నంబరు పంట కాలువ సమీపం.

– సువిశాలంగాను, రెండు ప్రక్కల – రెండేసి, మూడేసి వరుసల్లో పెంచిన – పెరిగిన సుశ్యామల వృక్షాలతోను తీర్చినట్లున్న ఈ దారి ప్రక్కల తామే నాటిన 70 పూల మొక్కల పాదుల్లో పెరిగిన గడ్డిని, అల్లిన తీగల్ని తొలగించి, పాదులు సరిజేసి, అవసరమైన మొక్కలకు బాదులతో ఊతమిస్తూ, కొందరు శ్రమించారు.

   – సుందరీకరణ బృందం పారలకు పనిచెప్పి, సుబ్బ నాగన్న సత్రం సమీపంలోని ప్రాంతాల గడ్డిని చెక్కి, తమ ప్రత్యేకతను చాటుకొని ఆచోటును మరింత దర్శనీయం చేశారు.

          – మహిళా కార్యకర్తలు దంతెలతో, చీప్పుళ్లతో మరింత స్వచ్చ శుభ్రం గావించారు.

  రాజమండ్రి ప్రయాణం 9.15 కే ఉన్నందున నేటి తమ స్వచ్చతా విధులను 5.45 కే ముగించిన కార్యకర్తలు ఆశ్రమ సత్రంలోనే సమావేశమై, నేటి తమ కృషిని సమీక్షించుకున్నారు.

కాస్త మిత భాషియైన వాసన కృష్ణారావు ముమ్మారు స్థిరంగా ప్రకటించిన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను అందరూ పునరుద్ఘాటించి, 6.00 కు నేటి కృషిని ముగించి, గృహోన్ముఖులయ్యారు.

      రేపటి మన శ్రమదానం కోసం గంగులవారిపాలెం దారిలోని మా (నల్లూరి రామారావు) ఇంటి దగ్గర కలుసుకుందాం.

కాలం కొండగుర్తులు

చల్లపల్లి ప్రజారోగ్యసమరం వయసైదేళ్లది

గ్రామ బాహ్య విసర్జనల కదనం వయసారేళ్లది

రాష్ట్ర వ్యాప్త ప్రజలలోన రగిలిన స్పూర్తి ఏ పాటిది?

ఆరోగ్య స్పృహ పెంచిన స్వచ్చోద్యమ కధ ఎట్టిది?

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

శనివారం – 26/10/2019

చల్లపల్లి.

1 నాగాయలంక రోడ్డులోని కమలాల వద్ద2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *