స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు (27.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు.

          నిన్న 9.30 నుండి, నేటి వరకు 4.49 – 6.00 మధ్య సమయాలు సచ్చోద్యమంలో ప్రత్యేక మైలు రాళ్లుగా చెప్పుకోవాలి. నరకచతుర్దశి, దీపావళి కొంతభాగం కార్యకర్తల ప్రయాణంలోను, రాజమహేంద్రవర పురస్కార స్వీకారంతో జరగడమే ఆ ప్రత్యేకత!

    నిన్న ఉదయం 9.30 కు స్వచ్చ సుందర చల్లపల్లికి జయజయధ్వానాలతో మొదలైన రాజమండ్రి 40 మంది బస్సు యాత్ర రెండు చోట్ల కొద్ది విరామాలాతో 3.30 కి గమ్యం చేరి, 5.00 – 9.30 మధ్య “నార్నికేదారేశ్వర కళావేదిక” లో రాష్ట్ర శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారి నుండి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు, పద్మావతి గారు కార్యకర్తల పక్షాన పురస్కారమందుకొని, తిరుగు ప్రయాణాన్ని ఈ రోజు 3.00 AM. కు ముగించడంతో విజయవంతమైంది.

“రాకా” సంస్థ సభ్యులు గాని, ఆహోతులైన పెద్దలు గాని, ప్రతి ఒక్కరు తమ ప్రసంగాలలో స్వచ్చోద్యమ చల్లపల్లిని పదేపదే ప్రస్తావించి, ప్రశంసించి, ఈ స్వచ్చ సైనికుల సుదీర్ఘ నిస్వార్ధ కృషిని ప్రత్యక్షంగా చూడాలని, మన గ్రామానికి రావాలని కోరిన వారే!

    నిన్న ఉదయం గ్రామ బాధ్యతలు నెరవేర్చి, 400 కిలోమీటర్లు ప్రయాణించి, రాజమండ్రి సమావేశంలో 4 గంటలకు పైగా ఉండి, నిద్ర లేకున్నా, మళ్ళీ గంటన్నర కొద్దిపాటి విశ్రాంతి పిదప నేటి తమ గ్రామ విధుల్లో – గంగులవారిపాలెం దారిలో – పాల్గొన్న 19 మంది కార్యకర్తలకు అభివందనాలు.

  ఒక గంటపాటు సాగిన దారి స్వచ్చతా కృషిలో వానలతో ఇరువైపుల క్రమ్ముకున్న గడ్డిని, పిచ్చి మొక్కల్ని, తీగల్ని – పూల తీగలు మినహాయించి – కొడవళ్ళతో, పారలతో తొలగించి, గొర్రులవారు వాటిని గుట్టలుగా లాగి, చీపుళ్ళ వారు దారిని ఊడ్చి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చారు.

బందరు రోడ్డులోని ‘లాబరేటరీ’ రవి ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ సౌందర్య సంకల్పాన్ని పునరుద్ఘాటించిన కార్యకర్తలు 6.15 కు తమ సేవలు ముగించారు.

ఉదయశంకర శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా మిఠాయిలు పంపిణీ జరిగింది. వారికి మన అందరి శుభాకాంక్షలు.

రేపటి మన గ్రామ కర్తవ్యం – సోమవారం కనుక – ఊరి ముఖ్య కూడలి దగ్గర నెరవేరుద్దాం.

   స్వచ్చోద్యమ సందేశం

అనుక్షణం కాలుష్యం హద్దు మీరి పోతుంటే –

పంచభూతములను కూడ పట్టిమ్రింగి వేస్తుంటే –

ఎవరెవరోరావాలని జనం ఎదురు చూస్తుంటే –

స్వచ్చోద్యమ మవతరించె – చాలవరకు చక్కదిద్దె!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 27/10/2019

చల్లపల్లి.

cam 4 Cam 1 “నార్నికేదారేశ్వర కళావేదిక” లో రాష్ట్ర శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారి నుండి పురస్కారంcam 2 cam 3

1 2 3 4 5 6 7.1 7 8 9 10 11 12 13 14

Powered by Facebook Like

One Response to స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1810, 1811* వ నాటి విశేషాలు (27.10.2019).

  1. KBnSarma says:

    It is meaning full happy moments congrats happy diwali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *