స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1812* వ నాటి విశేషాలు (28.10.2019)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1812* వ నాటి విశేషాలు.

          ప్రతి సోమ వారం లాగే నేటి ప్రభాతసమయం 4.05 – 6.05 మధ్య జరిగిన వీధి శుభ్రతా కృషిలో 28 మంది పాల్గొన్నారు.

     నాగాయలంక దారిలోని పెట్రోలు బంకు మొదలు కొని, మూడు రోడ్ల కూడలిని, బందరు మార్గంలోనిపెట్రోల్ బంకు, ATM సెంటరు దాక ఊడ్చి, దుమ్ము ఇసుకలు పోగుచేసి, ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను సమీకరించి, నిన్నటి దీపావళికి కాల్చి పేల్చిన టపాసుల వ్యర్థాలను కూడా ట్రాక్టరులో నింపి, డంపింగ్ సిలయానికి చేర్చారు.   

ఈ ముఖ్య వీధుల విషయం అలా ఉంచి, మిగిలిన దారులను, అధిక సంఖ్య లోని చిన్న సందులను స్వచ్చ కార్యకర్తలుగాని, స్వల్ప సంఖ్యలో ఉన్న పంచాయతి పారిశుద్ధ్య కార్మికులుగాని పూర్తిగా శుభ్ర పరచాలంటే ఎంత సమయం, శ్రమ అవసరమౌతుంది? అప్పటి దాక ప్రజల అసౌకర్యం, అనారోగ్యం సంగతేమిటి? రోడ్ల మీద చెత్తను వేసేవాళ్లు, బాణ సంచా కాల్చి వెళ్ళేవారు దీనికి బాధ్యతవహించారా? స్వచ్చ కార్యకర్తల కోసమో, పంచాయతి వారి కోసమో ఇంకా ఎన్నాళ్లిలా ఎదురు చూస్తారు? తమ హక్కులు, సౌకర్యాలతో బాటు ఇంతచిన్న బాధ్యతలను గూడ గ్రామ పౌరులమైన మనం ఆలోచించాలని మనవి.

   శనివారం నాటి రాజమండ్రి యాత్రను, ‘రాకా’ సంస్థ వారు నలుగురు ప్రముఖులను సత్కరించడాన్ని సదరు కార్యక్రమ నిర్వహణను ఈనాటి కాఫీ అనంతరం సమావేశంలో చర్చించారు, చల్లపల్లి తరహా స్వచ్చోద్యమాలు ఊరూరా, రాష్ట్రం-దేశం- ప్రపంచమంతా జరగవలసిన అనివార్యతను, అందుకు స్ఫూర్తిగా మాత్రమే ‘రాకా’ సత్కారాన్ని స్వీకరించామనే సంగతిని గమనించారు.

  సుమారొక సంవత్సరం నుండి (వాట్సప్ చూడకుండానే) స్వచ్చ కార్యకర్తల కృషి ఎక్కడ జరుగుతుందో గ్రహించి, వారి వద్దకు వచ్చి, నేస్తంగా మారిపోయిన మన గ్రామ సింహం ఈ రోజు కూడ అట్లేవచ్చి- ప్రమాద వశాత్తూ బస్ క్రింద పడి చనిపోవడం నేటి విషాదం!

    రేపటి మన స్వచ్చంద శ్రమదానం వర్షం లేకుంటే గంగులవారిపాలెం దారిలోను, వర్షం ఉంటే నాగాయలంక దారి – సుబ్బనాగన్న ఆశ్రమం సమీపంలోను కొనసాగిద్దాం.

మూమ్మాటికి ధన్య చరిత

ఈ స్వచ్చోద్యమ చరిత్ర ఇక్కడే మొదలవ్వలేదు

ప్రజల కొరకు శ్రమ దానం పాత కథే కావచ్చును

కానీ- ఐదారేళ్లుగ కలిసిమెలిసి ఇంతమంది

తదేక దీక్షగ కదలుట ధన్యచరిత ముమ్మాటికి!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 28/10/2019

చల్లపల్లి.

1 (4.05 A.M) 4.05 కు సెంటర్లో2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *