స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1813* వ రోజు బాధ్యతలు (29.10.2019).

Group Photo

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1813* వ రోజు బాధ్యతలు (29.10.2019).

          నిన్నటి సమిష్ట నిర్ణయం ప్రకారం ఈ వేకువ 4.05- 6.00 మధ్య గ్రామం చివరి వార్డు – చివర- గంగులవారిపాలెం బండ్రేవుకోడు గట్టున జరిగిన శుభ్ర- సుందరీకరణలో పాల్గొన్నవారు 25 మంది.      

       వీరిలో అత్యధికుల ఆయుధం కత్తే. (ఇందులో ఒక కార్యకర్త సవ్యసాచిలాగా రెండు చేతుల్లో రెండు కత్తులతో పనిచేయగలడు) పది రోజుల్నాడు ముంపువానల వల్ల ఆగిపోయిన ఇక్కడి పని మళ్ళీ ఈ దినం పునః ప్రారంభమైనదన్నమాట! మురుగుకాల్వ గట్టు మీద విచ్చలవిడిగా పెరిగిపోయిన గడ్డి, పిచ్చిమొక్కలు, నిరుపయోగమైన తీగలు, ఖాళీ సీసాలు, ఇతర తుక్కుల్ని నరికి, ఏరి, లాగి ట్రస్టుకు చెందిన ట్రాక్టర్ లోకెక్కించి, చెత్త కేంద్రానికి చేర్చారు. 4.30 సమయంలో ఇటీవలి చిరకాల నేస్తమైన వర్షం కాస్త తొంగి చూసినా, ఆటంకం కల్గించలేదు.

    నేటి స్వచ్చ కార్య స్థలానికి చెందిన ఒక్కరే మన కార్యకర్తలతో చేయి కలిపారు. ప్రస్తుత వర్ష ఋతువు ముగియకముందే బంతి వంటి పూల మొక్కలు మరికొన్ని వేలు గ్రామంలో నాటవలసి ఉన్నది.

ఈరోజు సుందరీకరణ పనులు జరగలేదు. నేటి కాఫీ తదుపరి ముగింపు సమావేశంలో సజ్జా ప్రసాదు గారు చల్లపల్లి స్వచ్చోద్యమ విశిష్టతను, స్వచ్చ కార్యకర్తల ఔన్నత్యాన్ని గుర్తు చేసి, దేశానికే మార్గదర్శకమైన ఈ మన ఉద్యమ భవితవ్యం కోసం మనమానసిక సంసిద్ధతను ప్రస్తావించి, ముమ్మారు స్థిరంగా నినదించిన స్వచ్చ గ్రామ సంకల్పాన్ని కార్యకర్తలంతా ఆమోదించి, 6.25 నిముషాలకు నేటి కర్తవ్య దీక్షను విరమించారు.

రేపటి పరిస్థితిని బట్టి – ఎక్కువ వర్షం ఉంటే నాగాయలంక దారిలో సుబ్బనాగన్న ఆశ్రమం దగ్గర, లేకుంటే గంగులవారిపాలెం దారిలో కలుసుకొందాం!

          చాటి చెప్పగలను సుమా!

అదృష్టమో – అనూహ్యమో స్వచ్చోద్యమ మసలు కాదని…

ప్రణాళికల – సదాచారణ ఫలితం ఇది సుమా అని…

కేంద్రబిందు వన్నిటికీ కేవల గ్రామ హితం అని…

స్వచ్చోద్యమ చల్లపల్లి చాటి చెప్పే చూడండని…

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 29/10/2019

చల్లపల్లి.

1 (4 A.M)4.00 A.M కు గంగులవారిపాలెం రోడ్డులో 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *