స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1814* వ నాటి శ్రమదానం (30.10.2019).

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1814* వ నాటి శ్రమదానం (30.10.2019).

          వీరబాబు, రామ లక్ష్మణులు వంటి స్థానికులతో సహా 28 మంది తమ గ్రామ స్వచ్చ- స్వస్తతల కోసం జరిపిన కృషి 22 వ వార్డులోని గంగులవారిపాలెం దారి కించుమించు చివరలో జరిగింది.

         బండ్రేవుకోడు ఉత్తరగట్టు, దారికి రెండో ప్రక్కన గల రకరకాల పిచ్చి మొక్కల్ని, తాము నాటి సంరక్షించిన పూల మొక్కలకు అల్లుకుపోతున్న పనికి రాని తీగల్ని, ఆ పాదుల్లోని గడ్డిని, ప్లాస్టిక్, గాజు సీసాలను, ఇతరేతర తుక్కును నరికి – పీకి, ఏరి, ఆ పొగుల్ని ట్రస్టు ట్రాక్టర్ లో నింపి, డంపింగ్  కేంద్రానికి తరలిచారు. ఇందులో సుమారు 20 మంది తమ ఖడ్గ చాలనాన్ని ప్రదర్శించగా, గొర్రులతో, చీపుళ్లతో కొందరు ఆ తుక్కును పోగులు చేశారు.    

మహిళా కార్యకర్తలు ప్రధానంగా చీపుళ్ళ కే పనిచెప్పి, రోడ్డును ఊడ్చి, శుభ్రం చేశారు. నేటి పని ప్రారంభంలోనే యధావిధిగా పరామర్శించి పోయిన వర్షంతో చిత్తడిగా ఉన్న దారిపై దుమ్మును, ఇసుకను, తుక్కును ఊడ్చడంలో ఎంత శ్రమ ఉందో, ఊడ్చిన వారికే తెలుస్తుంది.

సుందరీకరణ బృందం తెచ్చిన పూలమొక్కలు నాటడం కుదరక, వారు కూడ పారలకు, కత్తులకే పనికల్పించారు.

  నిన్న డాక్టర్. దాసరి రామకృష్ణ ప్రసాదు గారిని కలిసిన దేవరకోట గ్రామానికి చెందిన ప్రవాసి శ్రీ దోనేపూడి శరత్ గారు స్వచ్చ సుందర ఉద్యమాన్ని ఆమూలాగ్రం 2 గంటలు చర్చించి, 25 వేల విరాళం (వార్తా పత్రికల్లో ప్రచురించవద్దనే అభ్యర్ధనతో) ఇచ్చారు.

అడపా గురవయ్య కొన్ని జీవిత సత్యాలను వినిపించి, మూడు మార్లు నిర్దుష్టంగా నినదించిన స్వచ్చ సుందర సంకల్పాన్ని పునరుచ్చరించిన కార్యకర్తలు 6.30 నిముషాలకు నేటి బాధ్యతకు స్వస్తి పలికారు.

          రేపటి మన శ్రమదానం ఈ గంగులవారిపాలెంనే.

          ఐనా తొణకని. చెణకని.

ఏ మహాత్ముడో పూనెను స్వచ్చ సైనికుల యెదలో

ఏ మహనీయుల స్ఫూర్తో ఇందరి హృదయాలలో

ఈ సుదీర్ఘ ఉద్యమానికెన్ని ఆటుపోటులో

ఐనా తొణకని – బెణకని స్వచ్చ సైన్యమిదిగిదిగో!

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు – మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 30/10/2019

చల్లపల్లి.

1 4.10 కు గంగులవారిపాలెం రోడ్డులో2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 27 22.1 22.228 29 30 31 32 23 కార్యకర్తల శ్రమతో అందంగా కనిపిస్తున్న గంగులవారిపాలెం రహదారి24 25 26Lastరామారావు మాస్టారు ఇంటి ముందు పెట్టిన మొక్కలు పూలు పూచి చాలా అందంగా ఉన్నాయి. 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *