వదాన్యులకు విజ్ఞప్తి

f5f392a8-334f-4334-81a6-5af2eaa34f0b

వదాన్యులకు విజ్ఞప్తి

మరో 1000 మొక్కలు నాటిన స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు.

పచ్చదనం, పరిశుభ్రత, సుందరీకరణ లక్ష్యాలుగా 2014 నవంబర్ 12 న ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమం ప్రారంభిపడిన విషయం తెలిసిందే.

పచ్చదనంలో భాగంగా 2015 నుండి ప్రతి వర్షాకాలంలో స్వచ్చ కార్యకర్తలు మొక్కలు నాటుతున్నారు. దాదాపు 6 వేల మొక్కలు నాటి, వీలున్న చోటల్లా రహదారి వనాలను తయారు చెయ్యడం వలన గ్రామమంతా పచ్చగా కనిపిస్తోంది. అంతేగాక సువర్ణ గన్నేరు, కాగితం పూలు, లాంటానా, బిళ్ళ గన్నేరు, గన్నేరు వంటి పూల మొక్కలతో గ్రామం మరింత సుందరంగా కనిపిస్తోంది.

నెల రోజుల నుండీ విజయవాడ రోడ్డు, నాగాయలంక రోడ్డు, గంగులవారిపాలెం రోడ్డు, పాగోలు రోడ్డులలో ‘కడియం’ నుండీ తెప్పించిన 1000 అడవి తంగేడు (గద్ద గోరు) మొక్కలను స్వచ్చ కార్యకర్తలు నాటినారు. ‘మనకోసం మనం’ ట్రస్టు కార్మికులు వీటికి కంపను కట్టి రక్షిస్తున్నారు. మొక్క 35 రూపాయల చొప్పున ఇప్పటికి 35 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నడకుదురు రోడ్డులోనూ, పోగోలు రోడ్డులోనూ, మరికొన్ని చోట్ల నాటడానికి మరో 500 మొక్కలు కడియం నుండీ తెప్పించుచున్నాము.

ఈ 1500 మొక్కలను కొనడానికి 50 వేల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. కార్యకర్తలు శ్రమదానం చేస్తున్నారు. సుందర చల్లపల్లి కోసం వదాన్యులు ఎవరైనా ఈ ఖర్చుని విరాళంగా ఇవ్వమని అభ్యర్దిస్తున్నాము.

ఇట్లు

దాసరి రామకృష్ణ ప్రసాదు

స్వచ్చ కార్యకర్తలందరి తరపున

చల్లపల్లి -03.11.2019.

0f77f9b3-a46f-49e7-9a9c-cc7020aae2a1 52c2bd2d-1d1b-4ae4-a3a7-c1e169572e2f 67cb6780-2a01-43e0-9b62-6e3239afad6e b9f8d565-5402-4026-a9f7-e73c638e3dbb d944388d-0ee8-4d38-a26c-b0203b5379cb1 2 3 4 5 6 7

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *