స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03-10-2017

a14898a9-602f-4539-abe8-c8c9f4cd8f1a

అవిశ్రాంత స్వచ్ఛ సేవల వయసు : 1057* రోజులు

ఈరోజు ఉదయం 4-17 గంటల నుండి 6-30 గంటల వరకు 50 మంది కార్యకర్తలు పెదకళ్ళేపల్లి రోడ్డులో రోడ్డుపక్కల పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు. చెత్తను ట్రాక్టర్ తో డంపింగ్ యార్డుకు తరలించారు.

అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆంధ్రజ్యోతి విలేఖరి బ్రహ్మం గారు, సాక్షి విలేఖరి జిలాని గారు స్వచ్ఛ చల్లపల్లి సాధించిన అవార్డులకు గాను స్వచ్ఛ కార్యకర్తలను, పంచాయతీ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.
ఉపసర్పంచ్ ముమ్మనేని నాని గారు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలకు అభినందనలు తలియ చేశారు.

హీరో షోరూమ్ దాసరి శ్రీనివాస రావు గారి కుమార్తె “దాసరి రమ్యశ్రీ” చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” “స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం” అనే నినాదాలతో నేటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం ఉదయం 4-30 గంటలకు పెదకళ్ళేపల్లి రోడ్డులో కలుసుకుందాం.

నిన్న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘స్వచ్ఛతే సేవ’ ముగింపు కార్యక్రమంలో డా. డి.ఆర్.కె. ప్రసాద్, డా. పద్మావతి గార్లకు APPRECIATION AWARDను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందజేశారు. త్వరలో చల్లపల్లిని రానున్నానని తెలియ చేశారు.

స్వచ్ఛ చల్లపల్లికి జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీ, ఉత్తమ పార్కు, ఉత్తమ బస్టాండ్ అవార్డులను కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు, గ్రామ పంచాయతీ వారు హాజరైనారు. విజయవాడలో కార్యకర్తలకు భోజనాలను కేశవరావు గారు (GREEN LANDS) ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదములు.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
మంగళవారము – 03.10.2017

(చల్లపల్లి) విశేషాలు సశేషం

డంపింగ్ యార్డ్ అడుగడుగునా స్వచ్ఛ భటుల స్వేదమే
మొక్కలన్ని-పూవులన్ని మహిళల శ్రమదానమే
శ్రమ ఫలితమె సౌందర్యం – శ్రమ మూలమిదం జగం
చల్లపల్లి స్వచ్ఛోద్యమ చరితకు ప్రతిబింబం!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

3b1b6f9e-6c4f-4b04-8b00-8da9a52c6f23 b1b17c9f-24bc-4a61-9677-102e5d53317f 6d8b60e4-00ec-467f-8bd2-df90ef162b9b 713b4fcf-bd6e-4081-9849-abdd23ea317d 3592fc3e-01ef-468c-8d5d-ef473164baf5 cf722e60-ad02-4c32-8d0b-812a2677765d feda1e22-fd1e-4d93-8177-4e381a3c9c53

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *