స్వచ్ఛ సుందర చల్లపల్లి – 18-11-2017

4342218e-cdf4-4b5b-8af9-21b41b7e1ad0

మాటల కందని స్వచ్ఛ సైనికుల సేవ @ 1103* రోజులు

ఉదయం 4-15 గంటల నుండి 6-30 గంటల వరకు జరిగిన ఈనాటి కార్యక్రమంలో 50 మంది కార్యకర్తలు నాగాయలంక రోడ్డులో రెండు బృందాలుగా స్వచ్ఛ సేవ చేశారు.

ఒక బృందం పడమటి వీధి చెరువు వద్ద ఉన్న పెంటపోగును ట్రాక్టర్లలో నింపి డంపింగ్ యార్డులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి తరలించారు.

మరొక బృందం రోడ్డుపక్కల పిచ్చిమొక్కలు, తుక్కు తొలగించి డంపింగ్ యార్డుకు తరలించారు.

“దేసు మాధురి గారు” చెప్పిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” “స్వచ్ఛ సుందర చల్లపల్లిని సాధిద్దాం” అనే నినాదాలతో ఈనాటి స్వచ్ఛ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు ఈరోజు కూడా కొనసాగాయి.

గమనిక:
రేపు ఉదయం 6-00 గంటల నుండి చల్లపల్లి ATM సెంటర్ లో SRYSP జూనియర్ కాలేజీ, ZP హైస్కూల్ విద్యార్థులచే “ఆనంద ఆదివారం” కార్యక్రమం జరుగుతుంది.

కార్యకర్తలందరూ ఉదయం 5-00 గంటలకే స్వచ్ఛ చల్లపల్లి టీ షర్టు, టోపీ, ఐడెంటిటీ కార్డు తో తప్పక హాజరు కాగలరు.

ఎల్లుండి ఉదయం స్వచ్ఛ కార్యక్రమం కోసం నాగాయలంక రోడ్డులో కలుసుకుందాం.

25-11-2017వ తేదీ గుంటూరు యాత్ర (గుంటూరు గాంధీ గారి సంస్మరణ సభ, మహాప్రస్థానం పరిశీలన)కు వచ్చేవారు ప్రాతూరి శాస్త్రి గారికి, బృందావన్ కి తమ పేర్లు ఇవ్వగలరు.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ
మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
చల్లపల్లి
శనివారము – 18.11.2017

స్వచ్ఛ సైన్యం జైత్రయాత్రలు

విజృంభించే కల్మషాలను ఊరి నుండీ తన్ని తరిమీ
స్వచ్ఛతత్త్వం ఆకళించీ – సమానత్వం ప్రబోధించీ
స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వప్నసీమను నిరూపించీ
చల్లపల్లి స్వచ్చసైన్యం జైత్రయాత్రలు సాగుచున్నవి!

-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

 

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *